Begin typing your search above and press return to search.
బిచ్చగాడు 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. లెక్క ఎలా ఉందంటే?
By: Tupaki Desk | 20 May 2023 6:49 PM IST2016లో వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా 'బిచ్చగాడు'. మొదటి కథను శశి తెర పైకి తీసుకు రాగా ఇప్పుడు విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన బిచ్చగాడు 2 పై కూడా అంచనాలు పెరిగాయి. అప్పట్లోనే బిచ్చగాడు 1 తమిళంతో పాటు తెలుగు లోనూ భారీ కలెక్షన్ల ను రాబట్టి హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
'బిచ్చగాడు 2' మూవీకి మార్కెట్ లో డిమాండ్ ఓ రేంజ్‌లో ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ అన్నీ భారీ ధరలకు అమ్ముడపోయాయి. ఫలితంగా ఈ క్రేజీ సీక్వెల్ తెలుగు, తమిళ వెర్షన్లను కలుపుకుని అత్యధిక లొకేషన్లలో విడుదలైంది. అయితే, ఊహించని విధంగా ఆరంభంలోనే ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది.
'బిచ్చగాడు 2' మూవీకి తెలుగు తో పాటు తమిళంలోనూ మిశ్రమంగా మౌత్ టాక్ లభించింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ మాత్రం దీనికి మంచి ఓపెనింగ్స్ అందించారు. ఫలితంగా దీనికి కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు రూ. 2.32 కోట్లు షేర్, రూ. 4.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన 'బిచ్చగాడు' మూవీ తమిళంలో మాత్రం నిరాశనే ఎదుర్కొంది. దీనికి అక్కడ రూ. 1.50 కోట్లు వరకు మాత్రమే షేర్ లభించింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆశించిన స్థాయిలో వసూళ్ల ను రాబట్టలేకపోయింది. ఇలా మొత్తంగా మొదటి రోజు మాత్రం రూ. 4.00 కోట్లు షేర్, రూ. 8.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
మిక్స్‌డ్ టాక్‌తో 'బిచ్చగాడు 2' మూవీ మొదటి రోజు ఓపెనింగ్స్‌ను మంచిగానే రాబట్టుకోగలిగింది. కానీ, రెండో రోజు నుంచి ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలు కాబోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 'సింహాద్రి' మూవీ రీ రిలీజ్ హడావిడి కనిపిస్తూ ఉండడంతో 'బిచ్చగాడు 2' తేలిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే వీక్ డేస్‌లో కూడా దీనికి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.