Begin typing your search above and press return to search.

బిచ్చగాడు 2 బాక్సాఫీస్.. ఇది మామూలు బీభత్సం కాదు

By:  Tupaki Desk   |   21 May 2023 7:25 PM IST
బిచ్చగాడు 2 బాక్సాఫీస్.. ఇది మామూలు బీభత్సం కాదు
X
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో హీరోగా వచ్చిన తాజా చిత్రం బిచ్చగాడు-2 గురించి ఈ శుక్రవారమే థియేటర్లలోకి వచ్చింది. 2016లో సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2.. మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. భారీగానే వసూళ్లను రాబడుతోంది.

కొన్నేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమా 30 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సాధించింది. కానీ బిచ్చగాడు-2 చిత్రానికి సంబంధించిన ప్రారంభ సమీక్షలు చాలా వరకు నెగిటివ్ గానే వచ్చాయి. శశి దర్శకత్వ టచ్ లేకపోవడం వల్ల సినిమా ఇలా ఉందంటూ చాలా మంది విమర్శించారు. మరికొంత మంది సినిమా కథపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. కానీ వీటన్నిటిని దాటుకొని బిచ్చగాడు సినిమా హిట్టు వైపు దూసుకెళ్తోంది.

బిచ్చగాడు-2 చిత్రం మొదటి రోజు 4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి వారాంతం ముగిసే సమయానికి, బిచ్చగాడు-2 సీక్వెల్ 10 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటుతుందని అంచనా వేశారు. మరి రాబోయే వారాల్లో కూడా పెద్ద ఎత్తునే వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందనేది.

విజయ్ ఆంటోని బిచ్చగాడిలా కనిపించి సినీ చరిత్రలో ఎవరూ చేయని సాహసం చేసాడు. అద్భుతమైన హిట్టు కొట్టి అందరినీ మెస్మరైజ్ చేశాడు. బిచ్చగాడు హిట్టు కావడంతో.. బిచ్చగాడు-2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందనే గట్టి నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

విజయ్ సరసన ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. అలాగే రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడీ, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కృష్ణ స్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనియే నేరుగా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి కె పళని, పాల్ ఆంటోని, విజయ్ ఆంటోనీలు రచయితలుగా పని చేశారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా పని చేశారు.