Begin typing your search above and press return to search.

సమంత సెట్స్ లో నాని వదిన

By:  Tupaki Desk   |   13 April 2018 3:30 PM IST
సమంత సెట్స్ లో నాని వదిన
X
టాప్ హీరోయిన్ గా వెలిగిపోయి.. తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరం అయిన భూమిక.. ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంసీఏ చిత్రంలో హీరో నాని వదిన పాత్రలో.. సినిమాకు అత్యంత కీలకమైన రోల్ లో కనిపించి.. ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది భూమిక.

ఇప్పుడు ఈ సీనియర్ భామ మరో క్రేజీ ప్రాజెక్టును యాక్సెప్ట్ చేయడమే కాదు.. షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. కన్నడ యూ-టర్న్ మూవీని.. తెలుగు అండ్ తమిళ్ లో సమంత ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకు భూమికను తీసుకోగా.. ఇప్పుడు షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది ఈ సీనియర్ సుందరాంగి. ఓ ఫ్లైఓవర్ పై జరిగిన ప్రమాదాన్ని పరిశోధించే జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుండగా.. ఆ ప్రమాదంలో మరణించిన వ్యక్తి తల్లి పాత్రలో భూమిక నటిస్తోంది. మూవీలో ఈమెది అత్యంత కీలకమైన రోల్ కాగా.. బాగా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. కన్నడ యు-టర్న్ ను దర్శకత్వం వహించిన పవన్ కుమార్.. తెలుగు చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో సమంతకు లవర్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ నటిస్తుండగా.. పోలీస్ క్యారెక్టర్ లో ఆది నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయి.. రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు అందరూ కీలకమైన నటీనటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారని దర్శకుడు పవన్ కుమార్ చెబుతున్నాడు.