Begin typing your search above and press return to search.

మొన్న వదిన.. ఇప్పుడు దెయ్యం

By:  Tupaki Desk   |   22 March 2018 4:35 AM GMT
మొన్న వదిన.. ఇప్పుడు దెయ్యం
X
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేసిన భూమికా చావ్లా.. ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రంగప్రవేశం చేసింది. రీఎంట్రీలో ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. నాని లాంటి క్రేజీ హీరో చేసిన సినిమా ఎంసీఏలో.. కథ అంతా భూమిక చేసిన వదిన పాత్ర చుట్టూ తిరిగేదే కావడం గమనించాల్సిన విషయం.

ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు భూమిక చేతికి వచ్చిందని తెలుస్తోంది. పెళ్లి చేసుకున్నాక వరుస సినిమాలతో ఊపు మీద ఉన్న సమంత అక్కినేని.. ఇప్పటికే యూటర్న్ మూవీని స్టార్ట్ చేసేసిన సంగతి తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ సాధించిన ఈ థ్రిల్లర్ మూవీని.. తెలుగు-తమిళ్ లో రీమేక్ చేస్తోంది సామ్. దీనికి కూడా ఒరిజినల్ యూ-టర్న్ ను రూపొందించిన పవన్ కుమార్ నే దర్శకుడిగా తీసుకున్నారు. బైలింగ్యువల్ యూటర్న్ మూువీలో కీలకమైన పాత్రకు భూమికను అప్రోచ్ అయ్యారట. ఆమె కూడా ఓకే చెప్పేసేయడం విశేషం.

కన్నడలో రాధికా చేతన్ పోషించిన పాత్రను.. తెలుగులో భూమికతో చేయించనున్నారు. ఈ రోల్ ఒక దెయ్యం పాత్ర కావడంతో.. భూమిక కూడా ఆన్ స్క్రీన్ పై ఘోస్ట్ పాత్రలో కనిపించబోతోందన్న మాట. ఇప్పటివరకూ మిస్సమ్మ లాంటి చిత్రాలలో తన నటనతో పక్కన ఉన్న క్యారెక్టర్లను భయపెట్టిన భూమిక.. ఇప్పుడు ఆడియన్స్ ను కూడా భయపెట్టాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది.