Begin typing your search above and press return to search.

ప‌‌వర్ ‌స్టార్ హీరోయిన్ ఫిక‌రేంది గురూ?

By:  Tupaki Desk   |   6 Sep 2020 4:15 AM GMT
ప‌‌వర్ ‌స్టార్ హీరోయిన్ ఫిక‌రేంది గురూ?
X
`ఖుషీ` చిత్రంలో నాభి కేంద్రం ఎపిసోడ్ ని ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. గాలికి ప‌విట కొంగు కాస్త అటూ ఇటూ అయితే కుర్రాళ్ల‌ క‌ళ్లు ఆటోమెటిగ్గా అక్క‌డ ప‌డ‌తాయి! అంటూ ప‌వ‌న్- ఎస్.జె సూర్య‌ బృందం గొప్ప‌గానే చూపించారు. ఆ ఎపిసోడ్ ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని ఖుషీ చేసింది ఉత్త‌రాది సోయ‌గం భూమిక చావ్లా. ఆ త‌రువాత తెలుగు తెర‌పై క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. టాప్ స్టార్ ‌ల స‌ర‌స‌న న‌టించి ఒక ద‌శ‌లో గొప్ప‌ స్టార్ ‌డ‌మ్ ‌ని సొంతం చేసుకుంది. కానీ టాప్ హీరోయిన్ గా మాత్రం రాణించ‌‌లేక‌పోయింది. కెరీర్ మాంచి రైజింగ్ లో వుండ‌గానే యోగా గురు భ‌ర‌త్ ఠాకూర్ ని గురుద్వారాలో వివాహం చేసుకుంది.

2007లో పెళ్ల‌యితే 2014లో వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. ఆ త‌రువాత నుంచి సినిమాల్లో క‌నిపించ‌డం త‌గ్గింది. భూమిక‌కు భ‌ర‌త్ ఠాకూర్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు అంటూ ప్ర‌చారం అవ్వ‌డం తెలిసిందే. అటుపై మూడేళ్లు తెలుగు సినిమాల‌కు దూర‌మైన భూమిక `ఎంసీఏ` చిత్రంతో మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తెలుగు- త‌మిళ- హిందీ చిత్రాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టింది.

గ‌తం గ‌తః అనుకుంటే.. ప్ర‌స్తుతం భూమిక ఎక్క‌డుంది? ఏం చేస్తోంది? అంటూ అభిమానులు ప‌దే ప‌దే ఆరాలు తీస్తున్నారు. అయితే భూమిక‌లో క‌ళాతృష్ణ ఏమాత్రం త‌గ్గ‌లేదు. `ఎంసీఏ` చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన భూమిక ద‌క్షిణాది చిత్రాల్లో త‌ను చేయ‌ద‌గ్గ సినిమాల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇంత‌కుముందు స‌వ్య‌సాచి చిత్రంలో ఎం.ఎస్.ధోని చిత్రంలోనూ న‌టించిన సంగ‌తి విధిత‌మే. ప్ర‌స్తుతం త‌మిళంలో ఉద‌య‌నిధి స్టాలిన్ న‌టిస్తున్న `క‌న్నైనంబాతే`, తెలుగులో గోపీచంద్ హీరోగా సంప‌త్‌నంది రూపొందిస్తున్న `సీటీమార్‌` చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇవేగాక‌.. మ‌రిన్ని తెలుగు చిత్రాల‌కు ప్రపోజల్ వ‌చ్చింద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. వెబ్ సిరీస్ ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ట‌.