Begin typing your search above and press return to search.

అక్క పాత్రల్లోకి మారిపోతోన్న మిస్సమ్మ

By:  Tupaki Desk   |   7 Feb 2017 11:33 AM IST
అక్క పాత్రల్లోకి మారిపోతోన్న మిస్సమ్మ
X
టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ భూమికా చావ్లా. కొన్నేళ్లుగా ఈ భామ తెలుగు తెరపై కనిపించడం లేదు. పెళ్లి చేసుకున్నాక సినిమాలను కంటిన్యూ చేసింది కానీ.. తెలుగులో పెద్ద సినిమాలలో కనిపించలేదు. గతేడాది వచ్చిన ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ మూవీలో ధోనీ అక్క పాత్రలో కనిపించిన భూమిక.. చాలా కాలం తర్వాత ఓ తెలుగు సినిమాకు సైన్ చేసింది.

అయితే.. ఇది హీరోయిన్ పాత్ర కాదు.. ఇక్కడ కూడా ఓ అక్క రోల్ కే భూమిక ఓకే చేసింది. ప్రస్తుతం నేను లోకల్ ఎంజాయ్ చేస్తున్న నాని త్వరలో.. త్వరలో వేణు శ్రీరాం దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఈ మూవీలో నాని అక్క పాత్రకు చాలానే ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకే ఈ పాత్ర కోసం భూమికను అడగడం.. ఆమె కూడా ఓకే చేయడం జరిగిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు చెప్పిన నెరేషన్ బాగా నచ్చడంతోనే ఈ రోల్ కు భూమిక అంగీకరించినట్లుగా తెలుస్తోది.

ఆమె భర్త రోల్ కి కూడా ఓ పాపులర్ యాక్టర్ ను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు దర్శకుడు వేణు శ్రీరాం. నేచురల్ స్టార్ నటించనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో నిర్మించనుండడంతో.. క్యాస్టింగ్ విషయంలో కాంప్రమైజ్ అవాల్సిన విషయం ఉండదు. భూమిక చివరగా అల్లరి నరేష్ మూవీ లడ్డుబాబులో కనిపించగా.. నాలుగేళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమాకు సైన్ చేయడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/