Begin typing your search above and press return to search.

ప్రియుడితో కెమెరాకు చిక్కిన మ‌రో స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   7 July 2023 3:17 PM IST
ప్రియుడితో కెమెరాకు చిక్కిన మ‌రో స్టార్ హీరోయిన్
X
ఇటీవ‌ల కొంత‌కాలంగా మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా స‌హ‌న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో ప్రేమాయ‌ణం సాగిస్తోందంటూ మీడియాలో ప్ర‌చార‌మైంది. త‌మ‌న్నా అత‌డి ప్రేమ‌లో నిండా మునిగి ఉందంటూ క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు మ‌రో స్టార్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ వంతు.

బాలీవుడ్ అందాల నాయిక‌ భూమి పెడ్నేకర్ త‌న బాయ్ ఫ్రెండ్ యష్ కటారియాతో నిన్న‌టి రేయి (06 జూలై) కలిసి కనిపించారు. ఆ స‌మ‌యంలో ఇద్దరూ నలుపు రంగు దుస్తులు ధరించారు. య‌ష్ భూమి కార్ కి డ్యాష్ ఇచ్చి మాట్లాడ‌డం క‌నిపించింది. ఇక ఈ పార్టీ నైట్ లో భూమి సోదరి సమీక్షా పెడ్నేకర్ మ‌రికొందరు స్నేహితులు కూడా వారితో ఉన్నారు. భూమి పెడ్నేకర్ ట్యూబ్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది. అలాగే ఈ జంట తమ చుట్టూ ఉన్న మీడియా విష‌యంలో పెద్ద‌గా ఆందోళ‌న చెంద‌లేద‌ని తెలిసింది.

అయితే భూమి పెడ్నేకర్ డేటింగ్ జీవితం వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి. ఈ బ్యూటీ చాలా కాలంగా ఒంటరిగా ఉంది. 2019 సంవత్సరంలో విక్కీ కౌశల్ తో ఎఫైర్ అంటూ చిన్న‌పాటి ప్ర‌చారం సాగినా కానీ దానిపై స్ప‌ష్ఠ‌త లేదు. విక్కీ మొదటి హిట్ చిత్రం 'యూరి-ది సర్జికల్ స్ట్రైక్' విడుదలైన తర్వాత భూమితో ఎఫైర్ అంటూ క‌థ‌నాలొచ్చాయి. కానీ అది నిజం కాలేదు.

ఆస‌క్తిక‌రంగా ఇన్నాళ్ల‌కు మ‌రొక యువ‌కుడితో భూమి స‌న్నిహితంగా క‌నిపించింది. విదేశీ వెకేష‌న్ నుండి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. అయితే ఆ వ్యక్తి భూమి కారుకు డ్యాష్ ఇవ్వ‌డం సందేహాల్ని రేకెత్తించింది. ఇద్దరి మధ్యా డేటింగ్ వ్య‌వ‌హారం సీరియస్ గా ఉన్నట్లు మీడియా కి క్లారిటీ వ‌చ్చేసింది. త్వరలో ఈ జంట‌కు నిశ్చితార్థం కూడా జరిగే అవకాశం ఉంద‌ని ఇప్పుడు ముంబై మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

భూమి పెడ్నేకర్ - యష్ కటారియాల ఒక‌రికొక‌రు ప‌రిచ‌యం కావ‌డానికి కార‌కుడు న‌టుడు నిర్మాత‌ జాకీ భగ్నాని అని తెలుస్తోంది. ఆ యువ‌కుడు రియల్ ఎస్టేట్ డెవలపర్. కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా వివాహ రిసెప్షన్ లో భూమితో కలిసి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు.

భూమితో కలిసి అత‌డు ఆ ఫంక్షన్ కి వచ్చాడు. నిష్క్రమిస్తున్నప్పుడు అతను భూమి కారులో వెళుతుండ‌గా వీడ్కోలు పలుకుతూ ముద్దు ఇవ్వడం కనిపించింది. ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. యష్ కటారియా ముంబై - పూణేలలో భారీగా ఆస్తులను క‌లిగి ఉన్నాడు. భూమి పెడ్నేకర్ కెరీర్ ప‌రంగా జోరు మీద క‌నిపిస్తోంది. బదాయి దో చిత్రంలో న‌ట‌న‌కు భూమి చాలా అవార్డులను కైవసం చేసుకుంది.