Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆద‌మ‌రిచి న‌వ్వితే భూమి గిర‌గిరా తిర‌గాలి

By:  Tupaki Desk   |   5 April 2021 1:30 AM GMT
ఫోటో స్టోరి: ఆద‌మ‌రిచి న‌వ్వితే భూమి గిర‌గిరా తిర‌గాలి
X
ఆద‌మ‌రిచి హాయిగా అలా న‌వ్వేస్తోంది భూమి. ఆ న‌వ్వులో ఆ మోములో ఏదో తెలీని మాయ‌. ఆ మాయ మ‌త్తులోకి దించేస్తుంది. అందుకే బాలీవుడ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎంత‌మంది స్టార్లు స్టారాధిస్టార్లు ఉన్నా భూమి పెడ్నేక‌ర్ అనే పేరు మార్మోగుతూనే ఉంది. న‌ట‌వార‌సులు రాజ్య‌మేలే చోట ట్యాలెంట్ తో రాణిస్తున్న బ్యూటీల్లో ఒక‌రిగా భూమి పేరు వినిపిస్తోంది. య‌ష్ రాజ్ ఫిలింస్ సంస్థ‌లో కెరీర్ ప్రారంభించిన భూమి అంచెలంచెలుగా త‌న ఖ్యాతిని విస్త‌రించింది.

ప్ర‌స్తుతం ప్రామిస్సింగ్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇక భూమికి సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ అసాధార‌ణం. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. భూమి అలా ఆద‌మ‌రిచి ఎంత హాయిగా న‌వ్వేస్తుంటే కెమెరా క్లిక్ మంది. ఈ ఫోటోలో భూమి లుక్ ఎంతో ఇంప్రెస్సివ్. పాక్షికంగా ఇన్న‌ర్ అందాల్ని ఎలివేట్ చేస్తున్న ఆ డిజైన‌ర్ వైట్ టాప్ అంతే ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.

దమ్ లగా కే హైషా (2015)- టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ ( 2017), సోంచిరియా (2019)-సాండ్ కి ఆంఖ్ (2019) సహా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో భూమి న‌టించింది. ``ఒక వ్యక్తిగా నా కమ్యూనికేషన్ లో ఎక్కువ భాగం నా జెండ‌ర్ (మ‌హిళా) ని శక్తివంతం చేయడంలో నేను క్రూరంగా ఉన్నాను. న‌టిగా చాలా మంది వ్యక్తులను చేరుకోవడానికి నాకు మార్గాలు ఉన్నప్పుడు నేను దాన్ని ఉపయోగిస్తాను.. అని భూమి చెబుతుంటారు.

కొన్నిసార్లు బలమైన మహిళలకు అభిప్రాయం ఉండకపోవచ్చు. మెరుగైన జీవితాన్ని పొందడానికి ఇతర మహిళలను ప్రేరేపించే వారిని నేను ఆడుతున్నాను. సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే మరింతగా వారిని చేర్చడానికి ప్రేర‌ణ ల‌భిస్తుంది అని తెలిపారు.