Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సన్నబడి పెళ్ళికి సిద్దమైంది

By:  Tupaki Desk   |   31 July 2017 4:11 AM GMT
ఫోటో స్టోరి: సన్నబడి పెళ్ళికి సిద్దమైంది
X

రెండేళ్ళ కిందట బాలీవుడ్ సినిమాలో ఒక చిన్న సినిమా పెద్ద మార్పునే తీసుకువచ్చింది. యశ్‌ రాజ్ ఫిల్మ్స్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తీస్తారు అనే అపోహ పోగొట్టింది. వాళ్ళు ఒక లావుగా ఉన్న అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి ‘దమ్ లాగే కే హైషా’ సినిమా తీశారు. ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై అందరి అభిమానాన్ని పొంది పెద్ద విజయం పొందింది. ముఖ్యంగా లావుగా ఉన్న హీరోయిన్ భూమి పెడ్నెకర్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ అమ్మాయి ఒక సినిమా కోసం అనికాదు కానీ కమర్షియల్ హీరోయిన్ కావాలని బరువు తగ్గి ఒక పెళ్ళైన ప్రేమ కథ సినిమాలో హీరోయిన్ గా వస్తుంది. ‘టాయ్లెట్ ఏక్ ప్రేమ్ కథ’ అనే సినిమాలో అక్షయ్ కుమార్ కు జంటగా కనిపిస్తోంది ఇప్పుడు.

ఈ సినిమా ప్రమోషన్ లో ఇప్పుడు భూమి పెడ్నెకర్ బిజీ గా తిరుగుతుంది. ఈ మధ్యలోనే ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ మ్యాగజైన్ కు ఒక ఫోటో షూట్ చేసింది. అయితే అందరి హీరోయిన్లు లా కాకుండా కొంచెం కొత్తగా చేసింది భూమి. పర్పుల్ కలర్ డిజైన్ ఉన్న గౌన్ లో దాని పై గోల్డ్ టాప్ జాకెట్ వేసుకొని క్లాసిక్ ఫోజ్ ఇచ్చింది. మంద్రంగా మత్తుగా చూస్తూ ఆలోచనలను ఆరాటపెట్టే చూపులు చూస్తూ ఇలా కనిపించింది. భూమి మేకప్ టోన్.. ఆమె డ్రెస్స్ డిజైన్.. ఈ ఫోటో షూట్ లో హైలైట్ గా నిలిచాయి. బరువు తగ్గిన తరువాత కొన్ని ఫోటో షూట్లు చేసినా ఇంత క్లాసిక్ గా చేయలేదు అనే చెప్పాలి. ఫెమినా అంటే అన్నీ స్త్రీ అందాలను మరింత అందంగా చూపిస్తారు. కానీ ఈ వెడ్డింగ్ టైమ్స్ ఫోటో షూట్ లో స్త్రీని మాత్రమే గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు. స్త్రీ చూపులలో తెలియని భావాలు చాలానే ఉంటాయి అందులో ఇది ఒకటి అనేలా ఇక్కడ భూమి కనిపించింది.

టాయ్లెట్ ఏక్ ప్రేమ కథ సినిమా ఒక ఊరిలో ఒక సాధారణ ప్రేమ కథే కానీ అత్తరింటిలో టాయ్లెట్ లేదు అనే కారణంచేత ఒక కోడలు కాపురానికి రాను అని చెప్పి వెళ్లిపోతుంది. మరి మన హీరో టాయ్లెట్ కట్టి తన భార్యని తెచ్చుకుంటాడా లేదా అనేది, ఈ సంఘటన వలన ఎటువంటి మార్పులు వస్తాయి అనేది సినిమా గా చెబుతున్నారు. ఈ సినిమా ఆగష్టు 11 నాడు విడుదలకాబోతుంది.