Begin typing your search above and press return to search.

సన్నబడ్డ సన్నజాజి హాటుగుందే

By:  Tupaki Desk   |   29 Aug 2017 1:23 PM GMT
సన్నబడ్డ సన్నజాజి హాటుగుందే
X
చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనుకున్నది సాధించాలని వారికి ఇష్టమైన పని చేసి ఇష్టంగా కెరీర్ ను సెట్ చేసుకుంటారు. కానీ ఒక్కోసారి జీవితం కెరీర్ ను అనుకున్నదానికంటే ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు కొందరు అనూహ్యంగా ఊహించని స్థాయికి వెళతారు. అదే తరహాలో డైరెక్టర్ అవుదామని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా మారిన ఒక భామ ఎవరంటే.. భూమి పెడ్నేకర్.

మొదట అసిస్టెంట్ క్యాస్టింగ్ డైరెక్టర్ గా యాష్ రాజ్ సంస్థలో పనిచేసిన ఈ భామ అనూహ్యంగా అదే సంస్థలో "ధమ్ లగే కె హైశ" అనే హిందీ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ లో నటించి ప్రశంసలను అందుకుంది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందించినా భూమికి అంత పెద్దగా అవకాశాలు రాలేదు. ఎందుకంటే ఆమె భారీగా ఉండటమే అందుకు కారణం. వెంటనే ఆమె సన్నజాజిలా సన్నబడిపోయి.. అక్షయ్ కుమార్ "టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ" సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. సినిమాలో ఒక పేద కుటుంబానికి చెందిన ఇల్లాలిగా పద్దతిగా కనిపించింది. అలాగే ప్రస్తుత రోజుల్లో మహిళలు బహిర్భుమికి వెళ్లి ఏ స్థాయిలో అవమానపడుతున్నారో అనే కోణాన్ని ఆ సినిమాలో చూపించింది. ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.

కానీ మరిన్ని ఛాన్సులు రావాలంటే ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ కి పోటీని ఇవ్వాలి అనుకుందో ఏమో గాని ఒక్కసారిగా తన ఘాటు అందాలను ఆరబోస్తూ ఇప్పుడు ఫిలింఫేర్ కు ఫోజులిచ్చింది భూమి. మొన్నటివరకు ఎంతో హోమ్లీగా కనిపించిన భూమిని ఇలా ఘాటు గా చూసేసరికి అసలు ఆమె ఎవరని ప్రశ్నించుకుంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ సుందరి.. ఇలా రెచ్చిపోతే మాత్రం చాలా ఛాన్సులు వచ్చేస్తాయేమో.