Begin typing your search above and press return to search.

బొద్దుగుమ్మ‌ల స్లిమ్మవుతున్న సీజ‌న్ ఇది

By:  Tupaki Desk   |   16 Nov 2015 6:35 AM GMT
బొద్దుగుమ్మ‌ల స్లిమ్మవుతున్న సీజ‌న్ ఇది
X
ప్ర‌స్తుతం స్వీటీ అనుష్క గురించి టాలీవుడ్‌ - కోలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ డిస్క‌ష‌న్‌ న‌డుస్తోంది. యోగాతో స‌న్న‌జాజి తీగ‌లా తీరైన దేహ‌శిరుల్ని మెయింటెయిన్ చేసే ఈ గ్లామ‌ర‌స్ హీరోయిన్ ఉన్న‌ట్టుండి 20 కేజీల బ‌రువు పెరిగి బొద్ద‌మ్మాయ్‌ లాగా క‌నిపించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే సినిమా ప‌ట్ల త‌న క‌మిట్‌ మెంట్ కి అది నిద‌ర్శ‌నం. సైజ్ జీరో సినిమా కోసం, అందులో క్యారెక్ట‌ర్‌ లో ప‌ర‌కాయం చేయ‌డం కోసం స్వీటీ అంత సాహ‌సం చేసింది. అయితే బాలీవుడ్‌ లో అలాంటి ముద్దుగుమ్మ‌లు ఎవ‌రైనా ఉన్నారా?; అని ఆరాతీస్తే ఓ యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఈ అమ్మ‌డి పేరు భూమి పద్నేకర్‌.

భూమి న‌టించిన .. ద‌మ్ లగా కే ఐసా..ఇటీవ‌లే రిలీజై అట్టర్‌ ఫ్లాపైంది. కాకపోతే ఈ భామకు బొద్దు బ్యూటీగా బాగానే పేరొచ్చింది. బొద్ద‌మ్మాయిగా తెర‌పై మెరుపులు మెరిపించింది. ఆ క‌మిట్ మెంట్ కి ఫిదా అయిపోయిన అగ్ర నిర్మాణ సంస్థ‌ య‌శ్‌ రాజ్ ఫిలింస్‌ 3 సినిమాల కాంట్రాక్ట్ కుదుర్చుకోవ‌డం బాలీవుడ్‌ లో చ‌ర్చ‌కొచ్చింది. ఈ సినిమాల‌తో భూమి ఫ‌డ్నిస్ కెరీర్ ఎంతో ఎత్తుకు ఎదుగుతుంద‌ని అంచ‌నాలేస్తున్నారు. కెరీర్ కోసం - క‌మిట్ మెంట్ కోసం ఎంత‌కైనా తెగించే ముద్దుగుమ్మ‌లు అరుదుగానే క‌నిపిస్తారు. అందులో భూమి ఒక‌ర్తె అన్న‌మాట‌. ఇప్పుడిక మ్యాటర్‌ ఏంటంటే.. అన్ని సినిమాల్లో బొద్దుగా కనిపిస్తే కుదరదుగా.. అందుకే బంగార సన్నబడిపోతోంది. చక్కగా స్లిమ్మవుతూ ఆ షేపులతో ఒక ఫోటో షూట్ కూడా ఇచ్చింది. అంటే ఇక రచ్చేననమాట.