Begin typing your search above and press return to search.

గ‌తంలో చాలామందితో డేటింగ్ చేసింద‌ట‌

By:  Tupaki Desk   |   1 Oct 2017 8:01 AM GMT
గ‌తంలో చాలామందితో డేటింగ్ చేసింద‌ట‌
X
సౌత్ ఇండియ‌న్ హీరోయిన్స్ తో పోలిస్తే నార్త్ భామ‌లు ఫాస్ట్ గా ఉంటారు. అదేంది బాసూ.. సౌత్ లో ఏలేది కూడా నార్త్ భామ‌లే క‌దా? అన్న డౌట్ రావొచ్చు. ఇక్క‌డ క్లారిటీ ఏమిటంటే.. ప్రాంతం ఏదైనా.. టాలీవుడ్‌కి వ‌చ్చేస‌రికి చాలా ప‌ద్ధ‌తిగా ఉన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం హీరోయిన్ల‌లో క‌నిపిస్తుంది. ఎవ‌రిదాకానో ఎందుకు ఇల్లీ బేబీ ముచ్చ‌టే తీసుకోండి.

కొద్దికాలంగా సోష‌ల్ మీడియాలో చెల‌రేగిపోయే ఇలియానా.. తెలుగు మూవీస్ చేసేట‌ప్పుడు ఎలా ఉండేది? ఎవ‌రైనా ఇంట‌ర్వ్యూ చేస్తే ఎంత నాజూగ్గా స‌మాధానాలు ఇచ్చేది. మ‌రి.. అలాంటి భామ ఇప్పుడెలా ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇక‌.. ఇక్క‌డి హీరోయిన్లను ఇంట‌ర్వ్యూ చేసేట‌ప్పుడు ల‌వ్ మ్యాట‌ర్ లాంటివేమైనా ప్ర‌స్తావిస్తే.. ఇన్ స్టెంట్ స‌మాధానాలు చెప్పేయ‌టం కనిపిస్తాయి.కానీ.. బాలీవుడ్‌ లో మాత్రం అందుకు భిన్నం.

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం అక్క‌డి బ్యూటీల‌కు అల‌వాటు. కావాల‌ని చెబుతారో.. లైమ్ లైట్‌ లో ఉండొచ్చ‌న్న ఆలోచ‌నో కానీ హాట్ హాట్ వ్యాఖ్య‌లు చేసేస్తుంటారు.

తాజాగా అయుష్మాన్ ఖురానా హీరోగా న‌టించిన ద‌మ్ ల‌గాకే హైస్సా చిన్న‌ది భూమీ పెడ్నేక‌ర్ ముచ్చ‌టే చూడండి. అమ్మడు ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో ఎంత ఓపెన్ అయిపోయిందో చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వ‌టానికి ముందే తాను చాలామందితో డేటింగ్ చేసిన‌ట్లుగా చెప్పింది. బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన టైంలో ఈ భామ ఫ్యాటీగా ఉండి ఎవ‌రి కంట్లో ప‌డ‌లేదు. కానీ.. స్లిమ్ అయ్యాక హాట్ హాట్ గా మారిన ఈ సుంద‌రి ఇప్పుడు ఫేం కోసం ప్ర‌య‌త్నిస్తోంది.

అందులో భాగంగానే తాజా వ్యాఖ్య‌లు చేసింద‌న్న మాట చెబుతున్నారు. తాను మోడ్ర‌న్ యువ‌తిని అని చెప్పుకున్న భూమి.. తాను గ‌తంలో చాలామందితో డేటింగ్ చేసిన విష‌యాన్ని చెప్పింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో నిల‌బ‌డే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని.. ఏ హీరోతోనూ డేటింగ్ చేయ‌లేద‌ని పేర్కొంది. ఇలాంటి మాట‌లు వార్త‌ల్లో నిల‌వ‌టానికి చేసిందా? లేక‌..నిజంగానే భూమి మోడ్ర‌నా?