Begin typing your search above and press return to search.

భూమి మెరుపులు ఏం పెరిగాయో

By:  Tupaki Desk   |   6 Feb 2018 5:59 AM GMT
భూమి మెరుపులు ఏం పెరిగాయో
X

బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఇందుకు కారణం.. రీసెంట్ గా ఫోర్బ్స్ 30 అండర్30 లిస్ట్ లో ఈమె పేరు కూడా ఉండడమే. ఫోర్బ్స్ లిస్ట్ లో పేరు సంపాదించడం అంటే.. అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కే విషయమే. అందుకే ఈ సంగతిని పలు మార్లు చెప్పుకుని ఆమె మురిసిపోతుంటే.. ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అభిమానులు.

ఈ లిస్ట్ లో విక్కీ కౌశల్.. మిథిలా పాకర్.. జుబిన్ నాటియల్ కూడా ఉన్నా.. జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నది మాత్రం భూమి గురించే. ఇందుకు కారణం.. రెండున్నరేళ్ల క్రితం ఈమె కనిపించిన తీరు.. ఇప్పుడున్న స్థాయి ఏ మాత్రం పోల్చడానికి సాధ్యం కాని విషయం. దమ్ లగా కే హైసా చిత్రంలో భూమి పెడ్నేకర్ ఎంత లావుగా కనిపించిందో చూశాం. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ చిత్రంలో.. అసలు కామెడీ అంతా ఈమె చుట్టూనే సాగుతుంది. బోలెడంత ట్యాలెంట్ ఉన్నా.. ఆ తర్వాత కాసింత బ్రేక్ తీసుకుని.. ఈమె రీఎంట్రీ ఇచ్చిన తీరు సూపర్ అనాల్సిందే.

టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ.. శుభ్ మంగళ్ సావధాన్ చిత్రాలలో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హాట్ అండ్ సెక్సీగా తయారైపోయింది. ఫోటో సెషన్స్ లో సొగసులు చూపిస్తున్న తీరులో.. ఈ తరం యంగ్ భామలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఫ్యాట్ నుంచి హాట్ కు భూమి పెడ్నేకర్ మారిన తీరు మాత్రం అందరినీ మైమరపించేస్తోంది.