Begin typing your search above and press return to search.

హాటుగా మారిన టాయిలెట్ భామ.

By:  Tupaki Desk   |   4 July 2018 8:54 AM GMT
హాటుగా మారిన టాయిలెట్ భామ.
X
'దమ్ లాగాకే హైస్స' సినిమాతో అరంగేట్రం చేసింది భూమి పెడ్నేకర్. అందులో హోమ్లీ లుక్ తో మెరిసిన ఈమె అక్షయ్ కుమార్ తో నటించిన టాయిలెట్ సినిమాలో మరింత హోమ్లీ గా కనిపించింది. కాకపోతే గత కొన్ని రోజులుగా ఈమె పూర్తిగా తన రూటును మార్చేసుకుని మంచి మార్కులు కొట్టేయడానికి ప్రయత్నిస్తోంది.

మొన్నటికి మొన్న 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ ఫిల్మ్ లో బోల్డ్ గా నటించిన ఈమె ఇప్పుడు ఫోటోషూట్ల పేరుతో మళ్ళీ వేడి పుట్టిస్తోంది. ఇంత హాటుగా ఇదివరకెప్పుడు కనపడలేదే అని ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు. అలా అని ఆమె మరీ అంత ఎక్స్ పోసింగ్ ఎం చేయట్లేదు. బీచ్ డ్రెస్ వేసుకుని సైడ్ కి నిలబడి కేవలం సైడ్ యాంగిల్ లో తన అందాలను ఆరబోస్తోంది. ఆమె సెక్సీ చూపులతో ఎవరైనా సరే తప్పిపోవాల్సిందే అన్నట్టు ఉంది. సన్నని నడుముని సైడ్ నుండి చూపిస్తూ, మేకప్ పెద్దగా వేసుకోకుండా ఆమెను చూస్తుంటే అందరూ మైమరిచిపోతున్నారు.

అటు సినిమాలు, వెబ్ ఫిలిమ్స్ తోనే కాక భూమి ఫోటో షూట్లతో కూడా తన సత్తా చాటుకుంటోంది. ప్రస్తుతం ఈమె సన్ చిరయా అనే క్రైమ్ డ్రామాలో నటిస్తోంది. ఇందులో ధోని సినిమాతో హీరోగా మారిన సుశాంత్ సింగ్ రాజపుత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే, ఈమె ఫోటో షూట్లు చూపించి ఆఫర్లు చేజిక్కించుకోవలనే ఆశతో ఉంది భూమి పెడ్నేకర్.