Begin typing your search above and press return to search.

భూమి బ‌ర్త్‌ డే పార్టీ అదుర్స్‌

By:  Tupaki Desk   |   19 July 2018 11:04 AM GMT
భూమి బ‌ర్త్‌ డే పార్టీ అదుర్స్‌
X
బాలీవుడ్‌ లో పార్టీలు ఓ రేంజ్‌లో జ‌రుగుతుంటాయి. స‌హ‌జంగానే అక్క‌డ పార్టీ క‌ల్చ‌ర్ ఎక్కువ‌. ఇక బ‌ర్త్‌ డేల్లాంటి అకేష‌న్లు వ‌స్తే పార్టీలు దూమ్ ధామ్ అన్న‌ట్టుగానే ఉంటాయి. ఎవ‌రి శ‌క్తి మేర‌కు వాళ్లు గ్రాండ్‌ గా పార్టీలు ఇస్తుంటారు. తాజాగా క‌థానాయిక భూమి ప‌డ్నేక‌ర్ త‌న బ‌ర్త్‌ డేని పుర‌స్క‌రించుకొని పార్టీ ఇచ్చింది. `టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా`, `దమ్ లగాకే హైసా` - `శుభ్ మంగళ్ సావధాన్` త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి పేరు తెచ్చుకున్న క‌థానాయిక భూమి. హాట్ హాట్ అందంతో అద‌ర‌గొట్టే ఫిజిక్ ఆమె సొంతం. ఇటీవ‌ల మ‌రింత బిజీ అయిపోయింది.

ఈమె బ‌ర్త్‌ డే పార్టీ కోసం బాలీవుడ్‌ కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చారు. అందులో ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్‌ జోహార్‌ తో పాటు - యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్‌ ధావ‌న్‌ - క‌థానాయిక వాణిక‌పూర్‌... ఇలా ఆ లిస్టు చాలా పెద్ద‌దే. త‌న బ‌ర్త్‌ డే సంద‌ర్భంగా భూమి అదిరిపోయే బ్లాక్ డ్రెస్‌ని డిజైన్ చేయించుకొని, మ‌రింత హాట్‌ గా త‌యారై పార్టీకి వ‌చ్చింది. వేడుక‌లో వ‌రుణ్‌ - వాణిక‌పూర్‌ లు క‌లిసి డ్యాన్స్ వేసి భూమిని మ‌రింత ఖుషీ చేశారు. వాణిక‌పూర్ అయితే క్లీవేజ్ అందంతో - మంచి స్పైసీ లుక్‌ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. భూమి ఇచ్చిన బ‌ర్త్‌ డేపార్టీ గురించి, అక్క‌డ సంద‌డి గురించి బాలీవుడ్ జ‌నాలు ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నార‌ట‌. ఇప్పుడిప్పుడే మ‌రింత జోరును ప్ర‌ద‌ర్శిస్తున్న భూమి ఏ రేంజిలో దూసుకెళుతుందో చూడాలి. ప్ర‌స్తుతం ‘సంచిరియా' అనే క్రైమ్ థ్రిల్లర్‌ లో నటిస్తోంది. అభిషేక్ చౌబే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - మనోజ్ భాజ్‌ పాయ్ - అశుతోష్ రాణా కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.