Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్‌ : ఐరెన్‌ లేడీగా మారిన హాట్‌ లేడీ

By:  Tupaki Desk   |   18 July 2020 4:24 AM GMT
ఫస్ట్‌ లుక్‌ : ఐరెన్‌ లేడీగా మారిన హాట్‌ లేడీ
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ‘భుజ్‌’ ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదల అయ్యింది. ఈ లుక్‌ తో హాట్‌ సోనాక్షి కాస్త ఐరెన్‌ లేడీగా చాలా పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది. రియల్‌ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ మరియు సంజయ్‌ దత్‌ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంపై బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

1971లో ఇండియా పాకిస్తాన్‌ ల మద్య యుద్దం జరుగుతున్న సమయంలో సుందర్‌బెన్‌ జేత మదప్రయ తన సామాజిక కార్యకర్తల టీంతో కలిసి భారత ఆర్మీకి సహకారం అందించారు. 299 మందితో ఆమె భారత ఆర్మీకి అందించిన సేవకు పలువురి నుండి ప్రశంసలు దక్కించుకున్నారు. ఆమె కథాంశంతో ఇప్పుడు ఈ చిత్రం రూపొందుతుంది. ఆమె పాత్రనే సోనాక్షి సిన్హా పోషిస్తుంది.

ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ప్రణిత కూడా కీలక పాత్రలో నటిస్తుంది. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని డిస్నీ హాట్‌ స్టార్‌ లో డైరెక్ట్‌ గా విడుదల చేయబోతున్నారు. భారీ మొత్తానికి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను దక్కించుకున్నారు. ఈ చిత్రానికి అభిషేక్‌ దుధైయ దర్శకత్వం వహించాడు. ఫస్ట్‌ లుక్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు.