Begin typing your search above and press return to search.

ఇలా అయిపోయావేంటి భూమిక!!

By:  Tupaki Desk   |   12 Aug 2016 3:30 PM GMT
ఇలా అయిపోయావేంటి భూమిక!!
X
ఓ దశాబ్దం క్రితం భూమికా చావ్లా తెలుగులో టాప్ హీరోయిన్. పర్సనాలిటీ కాసింత పెద్దదైనా.. గ్లామర్ షో చేసేందుకు ఇష్టపడకపోయినా.. కేవలం తన అందం - ట్యాలెంట్ తోనే టాప్ హీరోలందరితోను సినిమాలు చేసేసింది. మిస్సమ్మలాంటి థీమ్ బేస్డ్ మూవీని సింగిల్ హ్యాండ్ తో హిట్ చేసేసి.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి ఉన్న సత్తా ఏంటో చూపించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైనపోయిన భూమిక.. ఇపుడు పూర్తిగా మారిపోయి స్క్రీన్ పై కనిపించనుంది.

ఈ నెల 30న విడుదల కానున్న ఎంఎస్ ధోనీ మూవీలో.. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి అక్కగా కనిపించింది భూమిక. రియల్ లైఫ్ లో ధోనీ అక్క ఎంత ఇన్‌ స్పిరేషన్ గా నిలించిందో రియల్ గా చెప్పలేం కానీ.. ట్రైలర్ మొత్తం మీద ఈమె ఒక్కసారి కనిపించిందంతే. పైగా మన సినిమాల్లో.. అక్కా చెల్లి కేరక్టర్లకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఉంటుంది.. ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

హీరోయిన్ గా టాప్ స్టేజ్ ని అనుభవించిన భూమిక.. ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని ఎటెంప్ట్స్ చేసి ఫెయిల్ అయ్యింది. ఏంటో.. హిందీ హీరోయిన్స్ లా పెళ్లయ్యాక కూడా ట్యాలెంట్ చూపించేందుకు సౌత్ హీరోయిన్స్ కు ఛాన్స్ దొరకదు. దొరికినా ఇలాంటివే. ధోనీ ట్రైలర్ లో తమ అభిమాన హీరోయిన్ ని చాన్నాళ్లకు చూసిన ఫ్యాన్స్.. ఇలా అయిపోయావేంటి భూమికా అనుకుంటూ బాధపడిపోతున్నారు.