Begin typing your search above and press return to search.

టీజర్‌ టాక్‌ : మళ్లీ భయపెట్టడం ఖాయం

By:  Tupaki Desk   |   14 April 2022 10:32 AM GMT
టీజర్‌ టాక్‌ : మళ్లీ భయపెట్టడం ఖాయం
X
అక్షయ్‌ కుమార్‌.. విద్యాబాలన్.. అమీషా పటేల్‌ కీలక పాత్రల్లో నటించిన భూల్ భూలయ్యా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 2007 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా కు ఇప్పటికి కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే భూల్ భూలయ్యా ప్రాంచైజీ లో రెండవ పార్ట్‌ ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. అందులో భాగంగానే భూల్ భూలయ్యా 2 ను తెరకెక్కించారు.

ఈ రెండవ పార్ట్‌ లో అక్షయ్‌ కుమార్‌ కాని విద్యా బాలన్ కాని కనిపించబోవడం లేదు. అనీస్ బాజ్మీ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు పెంచే విధంగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు. సూపర్‌ సస్పెన్స్ హర్రర్ సినిమా గా ఈ సినిమాను రూపొందించినట్లుగా టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది.

సినిమాలో ఉన్న తారాగణం ను పెద్దగా చూపించకుండా కేవలం టీజర్ లో హర్రర్‌ షాట్ ఒకటి చూపించి చివర్లో హీరోను కనిపించి కనిపించకుండా చూపించారు. సినిమాలో హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని టీజర్‌ లో చెప్పకనే చెప్పారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం భూల్ భూలయ్యా టీజర్ పై విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

ఈ సినిమా లో యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్ హీరోగా నటించగా.. కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించబోతుంది. కీలక పాత్రల్లో టబు.. రాజ్‌ పాల్‌ యాదవ్‌ మరియు పరేశ్‌ రావల్‌ లు నటించారు. సినిమా లో సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్‌ అంశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

ఈమద్య కాలంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ సన్నివేశాలు ఉంటే ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. కనుక ఈ సినిమాలో హర్రర్‌ సన్నివేశాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క చోట కూడా కామెడీ కూడా పండించే విధంగా స్క్రీన్‌ ప్లే సాగుతుందని బాలీవుడ్‌ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమాను మే 20వ తారీకున విడుదల చేయబోతున్నారు.