Begin typing your search above and press return to search.

#భోళాశంక‌ర్.. చెల్లి పాత్ర కోసం రూ.2 కోట్లు?

By:  Tupaki Desk   |   11 Nov 2021 5:51 AM GMT
#భోళాశంక‌ర్.. చెల్లి పాత్ర కోసం రూ.2 కోట్లు?
X
ఒక మెయిన్ స్ట్రీమ్ క‌థానాయిక‌ను చెల్లి పాత్ర‌లోనో లేదా అక్క పాత్ర‌లోనో న‌టించాల‌ని అడ‌గాలంటే ఏ ద‌ర్శ‌క‌నిర్మాత‌కు అయినా కాంప్లికేష‌న్ ఉంటుంది. అయితే స‌రిగ్గా ఇలాంటి క్లాజ్ ఒక‌టి క‌థానాయిక కీర్తి సురేష్ కి భారీ పేచెక్ ని అందిస్తుండ‌డం టాలీవుడ్ స‌ర్కిల్స్ లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక మెయిన్ స్ట్రీమ్ క‌థానాయిక అందుకున్నంత మొత్తాన్ని కీర్తి సోద‌రి పాత్ర‌లో న‌టించి త‌న ఖాతాలో వేసుకుంటుంద‌నేదే ఆ గుస‌గుస‌.

నేడు భోళాశంక‌ర్ లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో క‌నిపిస్తారు. అయితే అత‌డి చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేష్ ని చిత్ర‌బృందం ఎంపిక చేసుకుంది. దీనికోసం 2 కోట్ల పారితోషికం చెల్లిస్తేనే పాజిబుల్ అని కీర్తి డిమాండ్ చేసిన‌ట్టు కూడా గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి. అందుకు అంగీక‌రించాకే సంత‌కం చేసింద‌ని చెబుతున్నారు.

అయితే సోద‌రి పాత్ర‌లో న‌టించ‌డం కీర్తికి కొత్తేమీ కాదు. తాను ఎంచుకున్న మార్గం కొత్త‌గా ఉంద‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పుడు త‌న‌కు తండ్రి వ‌య‌సు ఉన్న సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న ప్రేయ‌సిగా న‌టించే కంటే సోద‌రిగా న‌టించ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని భావించి ప‌రిశ్ర‌మ సీనియ‌ర్ హీరోల‌కు మాత్రం సోద‌రిగా న‌టించేందుకు అంగీక‌రిస్తోంద‌ట‌. ఇక త‌న ఈడు జోడు కుదిరిన‌ న‌వత‌రం హీరోల స‌ర‌స‌న జోడీగా న‌టించేందుకు అంతే ఉత్సాహంగా ఉంటోంద‌ట‌. ఇంత‌కుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పెద్దన్న చిత్రం కోసం 2కోట్లు డిమాండ్ చేసింద‌ట. ఇందులో కీర్తి రజనీకాంత్ సోదరి పాత్రను పోషించింది. ఆమె పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. అలాగే ఇప్పుడు చిరంజీవి భోళా శంక‌ర్ లోనూ త‌న పాత్ర చాలా కీల‌క‌మైన‌ది. త‌న చుట్టూనే క‌థ అంతా తిరుగుతుంది. ఇది త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ వేదాళం కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసినదే.

మ‌హేష్ - ప‌వ‌న్ - నాని అయితే ఒక రూలు.. అంత‌కుమించిన ఏజ్ ఉన్న హీరోల‌కు ఇంకో రూలు అనువ‌ర్తిస్తోంది కీర్తి. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న `స‌ర్కార్ వారి పాట` చిత్రంలో కీర్తి సురేష్‌ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే సీనియ‌ర్ హీరోల విష‌యంలో ఒక రూలు .. కుర్ర హీరోలు అయితే ఇంకో రూల్ ని పాస్ చేసి బాగానే ఆడుకుంటోంది కీర్తి అంటూ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఒకటే గుస‌గుస వైర‌ల్ గా స్ప్రెడ్ అవుతోంది. సోద‌రి పాత్ర కోసం పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తూ బాగానే క్యాష్ చేసుకుంటోంద‌నేది ఈ గుస‌గుస సారాంశం. మ‌రోవైపు కీర్తి యువ‌హీరోల స‌ర‌స‌న వ‌రుస‌గా చిత్రాల‌కు క‌మిట‌వుతూ నాయికా ప్రాధాన్య క‌థాంశాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది.