Begin typing your search above and press return to search.

భోళాశంకర్ సమ్మర్ కి డౌటే..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 11:30 PM GMT
భోళాశంకర్ సమ్మర్ కి డౌటే..!
X
మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో దూకుడు మీద ఉన్నారు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా రాబోతున్న చిరు తన నెక్స్ట్ సినిమా మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ అని చేస్తున్నారు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్ గా వస్తుందని టాక్. అయితే ఆ సినిమాను తెలుగులో ఆల్రెడీ డబ్ చేశారు. కానీ సినిమా చేస్తున్నారని తెలిసి వేదాళం తెలుగు వర్షన్ తీసేశారు. ఇక కొన్నాళ్లుగా అసలు డైరెక్షన్ కి దూరంగా ఉన్న మెహర్ రమేష్ కి ఈ రీమేక్ ఛాన్స్ ఇవ్వడం పట్ల కూడా మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

భోళాశంకర్ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో వస్తుంది. అయితే సినిమా మీద డైరెక్టర్ మెహర్ రమేష్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా అనుకున్న విధంగానే అద్భుతంగా వస్తుందని అన్నారు. భోళా శంకర్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అసలైతే ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సంక్రాంతికే వాల్తేరు వీరయ్య వస్తుంది కాబట్టి మరీ నాలుగు నెలల గ్యాప్ లోనే సినిమా రిలీజ్ ఎందుకని భోళా శంకర్ ని దసరాకి షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ సినిమా చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. హడావిడిగా భోళా శంకర్ ని రిలీజ్ చేయకుండా సినిమాను చివరి నిమిషం వరకు మెగా ఫ్యాన్స్ ని అలరించేలా తీర్చిదిద్దాలని ఫిక్స్ అయ్యారట.

ఆచార్య, గాడ్ ఫాదర్ ఫ్లాపుల తర్వాత చిరు తన ప్రతి సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య అనుకున్న విధంగా హిట్ పడితే భోళా శంకర్ మీద మరింత ప్రెజర్ పడుతుంది. అసలే అది రీమేక్ సినిమా అని మెగా ఫ్యాన్స్ పెదవి విరుస్తుండగా వారికి సినిమాపై ఆసక్తి కలిగేలా ప్రోమోస్ రెడీ చేస్తున్నారట.

ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ గా నటించగా తమన్నా చిరుకి జోడీ కట్టింది. వాల్తేరు వీరయ్య సినిమా రిజల్ట్ అటు ఇటు అయితే మాత్రం భోళా శంకర్ మీద మరింత బాధ్యత పెరుగుతుంది. సో వీరయ్య రిజల్ట్ ఏదైనా సరే భోళా శంకర్ మాత్రం తప్పనిసరిగా మెగా ఫ్యాన్స్ ని అలరించాల్సిందే. మరి ఈ విషయంలో మెహర్ రమేష్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నది తెలియాల్సి ఉంది. భోళా శంకర్ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.