Begin typing your search above and press return to search.

పెద్ద‌మ్మ త‌ల్లి ఆశీస్సుల‌తో భోళాశంక‌ర్ మొద‌లు

By:  Tupaki Desk   |   15 Nov 2021 3:51 AM GMT
పెద్ద‌మ్మ త‌ల్లి ఆశీస్సుల‌తో భోళాశంక‌ర్ మొద‌లు
X
టుడే బాస్ డే! మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వేదాళం రీమేక్ భోళా శంకర్ ఇటీవ‌ల అధికారికంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. నేటి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ మొదటి రోజు షూటింగ్ కు ముందు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు.

భోళా శంకర్ పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్. చిరు ఇందులో స్వ‌భావ‌సిద్ధంగా భోళాగా క‌నిపిస్తారు. బాస్ మ‌రోసారి చెల‌రేగి న‌టించేందుకు ఆస్కారం ఉన్న స్క్రిప్ట్ ఇది. అందుకే మెహ‌ర్ చాలా హోప్స్ తో ఉన్నారు. ఇది ద‌ర్శ‌కుడికి కంబ్యాక్ సినిమా అవుతుంది. అందుకే ఈ మూవీ కోసం అతడు మునుపెన్న‌డూ లేనంత‌గా త‌పించి స్క్రిప్ట్ వ‌ర్క్ స‌హా ప్ర‌తిదీ వ‌ర్క‌వుట్ చేశాడు. ఒక ఫ్లాప్ ద‌ర్శ‌కుడే అయినా కానీ మెగాస్టార్ అత‌డిని న‌మ్మి అవ‌కాశం ఇచ్చినందుకు దానిని ప్రూవ్ చేయాల్సి ఉంది.

ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్లు తమన్నా క‌థానాయిక కాగా.. కీర్తి సురేష్ సోదరిగా నటిస్తున్నారు. సినిమాలో ఎక్కువ భాగం కోల్ కతాలో చిత్రీకరించనున్నారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్ టైనర్ ను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.