Begin typing your search above and press return to search.

#భోళాశంక‌ర్.. చిరు డ‌బుల్ రోల్ కి లుక్ టెస్టులు!

By:  Tupaki Desk   |   9 Nov 2021 6:30 AM GMT
#భోళాశంక‌ర్.. చిరు డ‌బుల్ రోల్ కి లుక్ టెస్టులు!
X
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే సినిమాని అధికారికంగా ప్ర‌క‌టించారు. తాజా స‌మాచారం మేర‌కు.. భోలా శంకర్ ఫోటోషూట్ లుక్ టెస్ట్ ప్రారంభించినట్లు దర్శకుడు మెహర్ రమేష్ తెలియజేశాడు.

న‌వంబ‌ర 11న సినిమా ప్రారంభోత్స‌వ పూజ జ‌ర‌గ‌నుంది. రెగ్యులర్ షూటింగ్ 15న ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ట్వీట్ చేస్తూ...``నవంబర్ 11వ తేదీ ఉదయం 7:45 గంటలకు మెగాస్టార్ భోళా శంక‌ర్ ఫోటోషూట్ .. లుక్ టెస్ట్ తో సినిమా ప్రారంభమ‌వుతుంది. 15వ తేదీ నుండి షూటింగ్ కొన‌సాగుతుంది`` అని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనుండ‌గా.. కీర్తి సురేష్ చిరుకి సోదరిగా కనిపించనుంది. దస‌రా కానుక‌గా రిలీజ్ చేసిన కీర్తి సురేష్ లుక్ వైర‌ల్ అయ్యింది.

ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై రామబ్రహ్మం సుంకర-అనీల్ సుంక‌ర‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారు. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ వేదాళంకి రీమేక్ ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్‌ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మెగాస్టార్ లోని మాస్ కోణాన్ని సినిమాలో హైలైట్ చేయ‌నున్నారు. రెండు విభిన్న‌మైన పాత్ర‌ల‌తో చిరు మెప్పించ‌నున్నారు. ఈ సినిమాతో పాటు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వాల్తేరు వాసు అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్ ఫాద‌ర్ గా చిరు న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం పూర్త‌యింది.