Begin typing your search above and press return to search.
భయపెడుతున్న భోళా శంకర్ బడ్జెట్
By: Tupaki Desk | 16 April 2023 2:45 PM ISTమెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం భోళా శంకర్. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా ఇది రెడీ అవుతోంది. సుమారు 13 ఏళ్ళ తర్వాత మెహర్ రమేష్ మరల మెగా ఫోన్ పట్టుకొని భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఆగష్టు 11న ఈ మూవీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీని అనిల్ సుంకర నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంది ఒక టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భోళా శంకర్ సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే పెరిగిపోయిందంట. ఇప్పటికే అనిల్ సుంకరకి ఏజెంట్ మూవీకి ఓవర్ బడ్జెట్ కావడంతో అదెలా వస్తుందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు భోళా శంకర్ కి కూడా మెహర్ రమేష్ హెవీగా ఖర్చు పెట్టేసినట్లుగా టాక్.
మెగాస్టార్ చిరంజీవి ప్రాఫిట్ షేర్ ఇవ్వడానికి ఒప్పుకొని అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. బడ్జెట్ పరిమితి దాటిపోవడంతో నిర్మాత అనిల్ విసిగిపోయి అమెరికా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా వెళ్ళే ముంది
మెగాస్టార్ సన్నిహితుడికి ప్రొడక్షన్ బాద్యతలు అప్పగించడం జరిగిందని టాక్. అయిన కూడా మెహర్ రమేష్ కంట్రోల్ లేకుండా భారీగా ఖర్చు పెడుతూనే ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. గతంలో మెహర్ రమేష్ బిల్లా, శక్తి సినిమాలు తెరకెక్కించారు.
ఈ రెండు సినిమాలకి కూడా ముందు అనుకున్న దానికంటే రెట్టింపు నిర్మాతలతో దర్శకుడు ఖర్చు పెట్టించాడంట. ఇప్పుడు 13 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పిలిచి అవకాశం ఇస్తే భోళా శంకర్ మూవీకి కూడా ఇలాగే చేస్తున్నారు అనే ప్రచారం నడుస్తోంది.