Begin typing your search above and press return to search.
భోళాశంకర్ తో యానిమల్ ఫైట్..అటుఇటు ఐతే!
By: Tupaki Desk | 14 Jun 2023 9:00 AMఈ ఏడాది సంక్రాంతికి మెగా బాస్ వాల్తేరు వీరయ్య రేసులో దిగి సూపర్ హిట్ రిజల్ట్ తో మెగా ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపింది. ఆచార్య ఫ్లాప్ తో ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్ కి వీరయ్య మాస్ మేనియా ఫుల్ మీల్స్ పెట్టేలా చేసింది.
ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి తర్వాత మరో 8 నెలల్లోనే మరో సినిమా రెడీ చేశాడు మెగాస్టార్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ మూవీ నిర్మిస్తున్నారు.
చిరంజీవి సరసన తమన్నా ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. దసరా తర్వాత కీర్తి సురేష్ చేస్తున్న ఈ సినిమాపై కూడా స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఇక చిరు సినిమాతో రిలీజ్ క్లాష్ అంటే అది చాలా పెద్ద రిస్క్ అన్నట్టే.
అలాంటిది బాలీవుడ్ సినిమా యానిమల్ చిరుతో పోటీకి సై అనేసింది. తెలుగు దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమా హిందీతో పాటుగా అన్ని సౌత్ భాషల్లో ఒకే రోజు రిలీజ్ అవుతుంది.
రీసెంట్ గా వచ్చిన యానిమల్ టీజర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచేలా చేసింది. యానిమల్ సినిమా పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా వస్తుంది. చిరంజీవి భోళా శంకర్ సిస్టర్ సెంటిమెంట్ తో వస్తుంది. అఫ్కోర్స్ మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు మెహర్ రమేష్ మిక్స్ చేస్తున్నా ఈ సినిమాకు పోటీగా యానిమల్ వస్తుండటం వల్ల ఆ సినిమా ఎఫెక్ట్ భోళా శంకర్ మీద పడే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.
రణ్ బీర్ సినిమాకు తెలుగులో అంత గొప్ప ఓపెనింగ్స్ ఉండవు. ఇక మెగాస్టార్ సినిమా అంటే మెగా ఫ్యాన్స్ హంగామా తెలిసిందే. అసలు ఈ రెండిటికీ పోటీనే కాదు అంటున్న వారు ఉన్నారు. కానీ అక్కడ ఉంది సందీప్ వంగా కాబట్టి యానిమల్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తన టాలెంట్ చూపించిన సందీప్ మీద తెలుగు ఆడియన్స్ కూడా మంచి హోప్ మీద ఉన్నారు.
సో భోళా శంకర్ అటు ఇటు అయితే మాత్రం అది కచ్చితంగా యానిమల్ కి కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం మెగా మేనియా ముందు యానిమల్ తట్టుకోవాల్సి ఉంటుంది. ఆగష్టు 11న జరిగే ఈ మెగా ఫైట్ లో రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.