Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో సహ నటిని బాదేశాడు

By:  Tupaki Desk   |   2 April 2018 1:29 PM IST
ఆ స్టార్ హీరో సహ నటిని బాదేశాడు
X
భోజ్ పురిలో పవన్ సింగ్ అనే స్టార్ హీరో దారుణంగా వ్యవహరించాడు. తన సహనటిపై ప్రతాపం చూపించాడు. మద్యం మత్తులో రెచ్చిపోయి ఆ నటిని గోడకేసి బాదేశాడు. ‘రేసుగుర్రం’తో విలన్ గా పరిచయమై తెలుగులో పలు చిత్రాల్లో నటించిన రవికిషన్ లాగే భోజ్ పురిలో పవన్ సింగ్ చాలా పెద్ద స్టార్. అతను ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అతను గాయకుడు కూడా. ఐతే వ్యక్తిగతంగా పవన్ సింగ్ కు బ్యాడ్ ఇమేజ్ ఉంది. అది మరోసారి బయటపడింది. ఒక సినిమాలో తనకు జోడీగా నటిస్తున్న అక్షర సింగ్ అనే స్టార్ హీరోయిన్ మీద అతను ప్రతాపం చూపించడం గమనార్హం. దీని గురించి శశికాంత్ సింగ్ అనే జర్నలిస్ట్ ఫేస్ బుక్ లో వివరాలు వెల్లడించాడు.

సిల్వస్సాలోని డామన్ గంగా అనే హిల్ రిసార్టులో అర్ధరాత్రి వేళ పవన్ సినిమా మద్యం మత్తులో అక్షరతో అసభ్యంగా ప్రవర్తించాడట. ఆమెను బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడని.. గోడకేసి బాదాడని శశికాంత్ వెల్లడించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రిసార్టు సిబ్బంది పైనా ఆయన దాడి చేసినట్లు చెప్పాడు. ఈ ఘటనలో అక్షర చేతికి తీవ్ర గాయమైంది. గతంలో అక్షరను పవన్ పలు సినిమాల నుంచి తప్పించినట్లు ఆరోపణలున్నాయి. ఆమెతో పవన్ కొన్నాళ్లు ఎఫైర్ కూడా నడిపాడు. ఆమెను తన ప్రేయసిగా మీడియాతోనే అన్నాడు పవన్. ఐతే ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని బాలియాలో జ్యోతి సింగ్ అనే వేరే అమ్మాయిని పవన్ పెళ్లాడాడు. ఈ నేపథ్యంలో అక్షరతో గొడవైనట్లుగా తెలుస్తోంది.