Begin typing your search above and press return to search.

ఏ క్షణంలోనైనా ఆత్మహత్య చేసుకుంటానంటున్న హీరోయిన్‌!

By:  Tupaki Desk   |   1 July 2020 3:00 PM IST
ఏ క్షణంలోనైనా ఆత్మహత్య చేసుకుంటానంటున్న హీరోయిన్‌!
X
సెలబ్రెటీలకు సోషల్‌ మీడియా పబ్లిసిటీ మార్గం అయ్యింది. ఎంతో మంది సెలబ్రెటీలు సోషల్‌ మీడియా ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుని సినిమాల్లో ఆఫర్లు కూడా దక్కించుకుంటున్నారు. ఈ సమయంలోనే కొందరు ఆకతాయిల కారణంగా హీరోయిన్స్‌ ఇతర లేడీ సెలబ్రెటీలు వేదింపులకు గురి అవుతున్నారు. తాజాగా బోజ్‌ పురి హీరోయిన్‌ రాణి చటర్జి తనకు ఎదురు అవుతున్న సోషల్‌ మీడియా వేదింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సోషల్‌ మీడియాలో తనను ఫాలో అవుతున్న ధనుంజయ్‌ సింగ్‌ అనే వ్యక్తి అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను ముసలిదాన అంటూ సంభోదిస్తూ అతడు చేస్తున్న కామెంట్స్‌ చూస్తుంటే ఆందోళన కలుగుతుంది. ఒకానొక సమయంలో అతడి వల్ల డిప్రెషన్‌ కు వెళ్తున్నాను. ఆ సమయంలో నాకు ఆత్మహత్య తప్ప మరే మార్గం లేదు అన్నట్లుగా అనిపిస్తుంది. ఆయన గురించి మొదట్లో పట్టించుకోవడం వద్దనుకున్నాను. అతడి ప్రవర్తన మరీ ఎక్కువ అవ్వడంతో చాలా మంది అతడి బూతులను అతడి అసభ్య పదజాలం కామెంట్స్‌ ను కొందరు నాతో షేర్‌ చేస్తున్నారు.

అతడిని బ్లాక్‌ చేసినా ఇంకా అతడి నుండి ఎంత దూరంగా ఉన్నా కూడా అతడు మాత్రం నన్ను వదిలి పెట్టడం లేదు అంటూ ఫిర్యాదులో పేర్కొంది. అతడి నుండి తనను కాపాడకుంటే మాత్రం నేను ఏ క్షణంలో అయినా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. డిసెంబర్‌ లో పెళ్లికి సిద్దం అవుతున్న సమయంలో అతడి వేదింపులతో మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లుగా ఆమె పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు ధనుంజయను ప్రశ్నిస్తున్నారట.