Begin typing your search above and press return to search.
మరో షాక్: ముంబయిలో మరో నటి సూసైడ్
By: Tupaki Desk | 7 Aug 2020 10:00 AM ISTబాలీవుడ్ కు.. ముంబయిలోని నటీనటుల టైం ఏమాత్రం బాగోనట్లుగా ఉంది. లాక్ డౌన్ నాటి నుంచి ఏదో ఒక ఇష్యూ ముంబయి చిత్ర పరిశ్రమను కుదిపిస్తుంది. ఈ మధ్యనే బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం ఎంతటి సంచలనంగా మారిందన్నది తెలిసిందే. రోజుకో మలుపుతో.. క్రైం థ్రిల్లర్ ను పోలినట్లుగా ఈ వ్యవహారం ఉంది. ఇటీవల కాలంలో వరుస పెట్టి ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న వేళ.. తాజాగా మరో నటి సూసైడ్ చేసుకోవటం షాకింగ్ గా మారింది.
ముంబయికి చెందిన భోజ్ పురి సినీ..టీవీ నటి నలభై ఏళ్ల అనుపమ పాథక్ తాజాగా తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ఒక రోజు ముందు ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో లైవ్ లో మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే.. ఆమె ఫేస్ బుక్ ఖాతా అధికారికం కాకపోవటం గమనార్హం. ఆమె లైవ్ లో ఎవరినీ ఎప్పటికి నమ్మొద్దని.. అది తన జీవితంలో నేర్చుకున్న పాఠంగా ఆమె పేర్కొన్నారు.
‘‘అందరితోనూ విశ్వాసపాత్రంగా ఉండండి. కానీ.. ఎవరినీ ఎప్పటికి నమ్మొద్దు’’ అని ఆమె మాట్లాడిన పక్కరోజునే ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్న దగ్గరే ఆమె ఒక నోట్ ఉంచారు. అందులో తన దగ్గర డబ్బులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు. బిహార్ కు చెందిన అనుపమ ముంబయికి వచ్చి ఉంటున్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలు ముంబయి చిత్ర పరిశ్రమలో కొత్త చర్చకు తెర తీస్తున్నాయి.