Begin typing your search above and press return to search.

బార్ పార్టీలో 'భీమ్లా నాయ‌క్' హ‌ల్చ‌ల్ వీడియో వైర‌ల్!

By:  Tupaki Desk   |   12 March 2022 9:32 AM GMT
బార్ పార్టీలో భీమ్లా నాయ‌క్ హ‌ల్చ‌ల్ వీడియో వైర‌ల్!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-టాలీవుడ్ హంక్ రానా న‌టించిన 'భీమ్లా నాయ‌క్' ఇటీవ‌ల రిలీజ్ అయి ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌ర్ స్టార్ కెరీర్ లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కోట్ల క‌న‌క వ‌ర్షం కురిపించింది. ఏపీలో టిక్కెట్ ధ‌ర‌ల‌తో సంబంధం లేకుండానే మెరుపు వ‌సూళ్ల‌ను సాధించింది. దీంతో నిర్మాత‌ల ఆనంధానికి అవ‌ధుల్లేవ్. ప‌వ‌ర్ స్టార్ ఎప్పుడు బ‌రిలోకి దిగినా ఇదే సీన్ రిపీట్ అవుతుంద‌నే సంకేతాలు పంపారు. ఈ సంద‌ర్భంగా 'భీమ్లా నాయ‌క్' యూనిట్ పెద్ద ఎత్తున స‌క్సెస్ పార్టీ సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

దానికి సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఆ పార్టీకి- సినిమాకి ప‌ని చేసిన కీల‌క వ్య‌క్తులంతా హాజ‌ర‌య్యారు. అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉన్నారు. ఓ బార్ లో ఈ ఆ పార్టీని ఏర్పాటు చేయ‌గా దాదాపు అంతా అంటెడ్ పార్టీని ఎంజాయ్ చేసారు. తాజాగా ఆవేడుక‌కు సంబంధించిన వీడియో ఒక‌టి ఇన్ స్టా వైర‌ల్ గా మారింది. బ్యాక్ గ్రౌండ్ లో భీమ్లా బ్యాక్ ఆన్ డ్యూటీ సాంగ్ ప్లే అవుతుంది. ఆ పార్టీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ విచ్చేస్తున్న స‌న్నివేశం ఆ వీడియోలో హైలైట్ అయింది.

ప‌వ‌న్ కి 'భీమ్లా నాయ‌క్' టీమ్ స‌భ్యులంద‌ర్నీ మ‌రోసారి త్రివిక్ర‌మ్ ప‌రిచయం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈ పార్టీలో సాగ‌ర్ చంద్ర‌..నిర్మాతలు చిన‌బాబు.. సురేష్ బాబు..థ‌మ‌న్ పాల్గొన్నారు. ఇంకా వైష్ణ‌వి కొవ్వూరి..ప్ర‌త్యూష ప‌ల్ల‌పోతు.. లక్ష్మీ మేఘ‌న‌.. ర‌చిత రాయ‌ప్రోలు..ప్ర‌ణీక‌..రిటా త‌దిత‌రులు చిత్రానికి సంబంధించిన వారు హాజ‌ర‌య్యారు.

ఈ సినిమాకి సంబంధించి టీమ్ అంద‌ర్నీ ఎలా ముందుండి న‌డిపించారో..ఈవెంట్ ని కూడా ఆయ‌నే ముందుండి న‌డిపిచిన‌ట్లు తెలుస్తోంది. మాయావీనే క‌ర్త‌..క‌ర్మ‌..క్రియ గా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు క‌నిపిస్తుంది.

ప‌వ‌న్ క‌ళ్యాన్ తో ఆయ‌న‌కున్న సాన్నిహిత్యం కార‌ణంగానే 'భీమ్లా నాయ‌క్' స‌క్సెస్ పార్టీకి ప‌వ‌న్ హాజ‌రైన‌ట్లు చెప్పొచ్చు. సాధార‌ణంగా ప‌వ‌న్ సినిమాల్లో న‌టించ‌డం..రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజ‌ర‌వ్వ‌డం వ‌ర‌కే ప‌రిమితం అవుతారు. ఆ త‌ర్వాత సినిమా స‌క్సెస్ అయినా ఎలాంటి కార్య‌క్ర‌మాల‌కి హాజ‌రు కారు.

కానీ ప‌వ‌న్ ఇప్పుడు మ‌ళ్లీ వ‌రుస‌గా సినిమాలు చేస్తోన్న నేపథ్యంలో ఇలా అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాల‌కి హాజ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ప‌రిశ్ర‌మ‌కి దూరంగా ఉండే ప‌వ‌న్ ఇప్పుడు వాళ్ల‌తోనూ క‌లపుగోలు త‌నంతో ముందుకు వెళ్లే ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది.