Begin typing your search above and press return to search.

భీష్మ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

By:  Tupaki Desk   |   28 Feb 2020 6:16 AM GMT
భీష్మ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
X
నితిన్ - రష్మిక హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'భీష్మ' ఈ నెల 21 న విడుదలైంది. నిన్నటితో వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వారం రోజుల్లో దాదాపు 24 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ విలువ 22.50 కోట్లు. దీంతో ఓవరాల్ గా బ్రేకీవెన్ అయింది. కొన్ని ఏరియాలలో బయ్యర్లు లాభాల్లోకి రాగా.. కొన్ని ఏరియాలలో బ్రేకీవెన్ కు దగ్గరలో ఉంది. సినిమాలకు అన్ సీజన్ అయినప్పటికీ ఇలా బయ్యర్లు లాభాల్లోకి రావడం మాత్రం గొప్ప విషయమే. మరి ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్షన్ నమోదు చేస్తుందో వేచి చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో 'భీష్మ' మొదటివారం కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నైజామ్: 7.52 cr
సీడెడ్: 2.86 cr
ఉత్తరాంధ్ర: 2.57 cr
కృష్ణ: 1.35 cr
గుంటూరు: 1.53 cr
ఈస్ట్: 1.44 cr
వెస్ట్: 1.18 cr
నెల్లూరు: 0.62 cr

ఎపీ+తెలంగాణా: 19.07 cr

రెస్ట్ అఫ్ ఇండియా: 1.78 cr
ఓవర్సీస్: 3.00 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 23.85 cr