Begin typing your search above and press return to search.

ఓటీటీల దెబ్బకు సినిమాల రేటింగ్స్ పడిపోతున్నాయిగా..!

By:  Tupaki Desk   |   5 Nov 2020 5:40 PM GMT
ఓటీటీల దెబ్బకు సినిమాల రేటింగ్స్ పడిపోతున్నాయిగా..!
X
కరోనా లాక్ డౌన్ లో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకున్నాయి. ఇళ్లకే పరిమితమైన జనాలు ఓటీటీలలో వచ్చే కంటెంట్ ని ఆదరిస్తూ వచ్చారు. ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలను కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఓటీటీలు వచ్చాక సినిమాలకి ఆశించిన స్థాయిలో శాటిలైట్ రేటింగ్స్ రావడం లేదని తెలుస్తోంది. ఈ మధ్య టీవీలలో ప్రసారం అవుతున్న చాలా సినిమాలు అతి తక్కువ టీఆర్పీ నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటీ రెండు పెద్ద సినిమాలు తప్ప చాలా వరకు లీస్ట్ టీఆర్పీతో సరిపెట్టుకున్నాను. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'సాహో' సైతం బుల్లితెరపై ఆశించిన స్థాయిలో రేటింగ్స్ తెచ్చుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల టీవీలో టెలికాస్ట్ అయిన యూత్ స్టార్ నితిన్ నటించిన 'భీష్మ' సినిమా చాలా తక్కువ టీఆర్పీ తెచ్చుకుందని తెలుస్తోంది.

నితిన్ - రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన 'భీష్మ' చిత్రానికి వెంకీ కుడుములు దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నితిన్ కు సాలిడ్ కంబ్యాక్ గా నిలవడమే కాకుండా అతని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలబడింది. అయితే బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ చిత్రానికి స్మాల్ స్క్రీన్ పై మాత్రం ఊహించని టీఆర్పీ వచ్చింది. దసరా ప్రీమియర్ గా జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన 'భీష్మ' కేవలం 6.65 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుందని తెలుస్తోంది.

'భీష్మ' కు వచ్చిన రేటింగ్ మరీ తీసి వేయాల్సింది కానప్పటికీ మొదటిసారి టెలికాస్ట్ అయిన సూపర్ హిట్ సినిమాకి మాత్రం ఇది తక్కువ టీఆర్పీ అని చెప్పాలి. టాలీవుడ్ లో ఈ ఏడాది చివరగా థియేటర్స్ లో విడుదలైన క్రేజీ మూవీగా నిలిచిన 'భీష్మ' లాక్ డౌన్ ప్రారంభం నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలని హోమ్ స్క్రీన్ లలో చూసేయడంతో మళ్ళీ టీవీలలో చూడటానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా క్రేజీ సినిమాలకు ఇలాంటి రేటింగ్స్ రావడం అనేది కాస్త నిరాశ కలిగించే అంశమనే చెప్పాలి.