Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: భీష్మ ఆపరేషన్ సర్ ప్రైజ్ చేస్తోందే!
By: Tupaki Desk | 17 Feb 2020 7:23 PM ISTఇటీవలి కాలంలో రైతులు వ్యవసాయం అంటూ మన దర్శకులు నేల మీదికి వొంగి చూస్తున్నారు. మట్టి వాసన పేరుతో బాక్సాఫీస్ కనకవర్షం కురిపించే ఫార్ములాని వెతికి పట్టుకున్నారు. చూస్తుంటే భీష్మ కథ కూడా అలానే కనిపిస్తోంది. ఇన్నాళ్లు రిలీజ్ చేసిన పోస్టర్లు చూసి.. అల్లరి చిల్లరగా తిరిగే ఆజన్మ బ్రహ్మచారి ఏదో అమ్మాయికి లైనేస్తున్నాడులే అనుకుంటే ఉన్నట్టుండి పొలం.. రైతన్న.. సేంద్రియ వ్యవసాయం అంటూ పెద్ద లెక్చరే ఇస్తున్నాడు భీష్మ. ఆరు నెలల్లో పండాల్సిన పంట నాలుగు నెలలకే చేతికొస్తే అంటూ కార్పొరెట్ గురువులు ఏదో స్కీమ్ వేస్తే దానిని వ్యతిరేకించే కుర్రాడిగా నితిన్ ఏదో గట్టి మిషన్ తోనే కనిపిస్తున్నాడు.
ఓవైపు రష్మికతో లవ్ రొమాన్స్ అంటూనే మరోవైపు కార్పొరెట్ వాణిజ్యంలో కుయుక్తుల వల్ల మానవాళికి కలిగే ముప్పును ఆపే ఆపరేషన్ చేపట్టాడు. సాఫ్ట్ గా కనిపిస్తూనే సావగొడుతున్నాడు. పొలంలో దిగి మక్కెలిరగదన్నుతున్నాడు. మొత్తానికి భీష్మలో ఆ రెండో యాంగిలే ట్రైలర్ లో ఎక్కువ హైలైట్ చేయడంతో క్యూరియాసిటీ పెరిగింది. అయితే చాలా కాలం క్రితం 1 నేనొక్కడినే సినిమాలో సుకుమారు వరి కంకిని చూపించి దీనికోసమే మహేష్ ఇదంతా చేశాడు! అని తేల్చేయడంతో దానిని జనం జీర్ణించుకోలేకపోయారు. అలా కాకుండా సేంద్రియ ఎరువులు.. విత్తనాలు.. వంగడాలు.. వాణిజ్యం .. అనే పాయింట్ కి ఎలాంటి కమర్షియల్ టచ్ ఇచ్చారు? అన్నది చాలా కీలకంగా మారనుంది. ఆద్యంతం కుర్చీ అంచున కూచోబెట్టేంత గ్రిప్పింగ్ సన్నివేశాలు సినిమా ఆద్యంతం ఉంటాయా? వెంకీ కుడుముల ఆ లెవల్లో తెరకెక్కించాడా? అన్నది చూడాలి. ట్రైలర్ లో రష్మిక గ్లామర్ ఎలిమెంట్స్.. నితిన్ లవ్ ఎలిమెంట్స్ అస్సెట్ కానున్నాయి. మహతి సాగర్ సంగీతం రీరికార్డింగ్ అదనపు అస్సెట్ కానున్నాయి.
అన్నట్టు భీష్మ అంటే ఏమిటి? నితిన్ పేరు ఒక్కటే భీష్మ కాదు..కొత్తరకం వంగడాలు విత్తనాల పేర్లు కూడా భీష్మ అని చూపించారు కాబట్టి ఆ కంపెనీకి భీష్మకి ఏంటి సంబంధం అన్నది చూడాలి. ప్రేమకథకు సామాజిక సందేశాన్ని జోడించారు. మూవీలో దమ్మెంతో తెలియాలంటే ఫిబ్రవరి 21 వరకు ఆగాల్సిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.