Begin typing your search above and press return to search.

భీష్మ నాలుగు రోజుల వ‌సూళ్లు

By:  Tupaki Desk   |   25 Feb 2020 7:30 AM GMT
భీష్మ నాలుగు రోజుల వ‌సూళ్లు
X
తొలి వీకెండ్ అయ్యాకా నిల‌దొక్కుకుంటేనే ఈరోజుల్లో మొన‌గాడు. బాక్సాఫీస్ వ‌ద్ద నాలుగో రోజు వ‌సూళ్లు చాలా కీల‌కంగా ట్రేడ్ లో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఆ కోవ‌లో చూస్తే భీష్మ వ‌సూళ్ల‌ లో మొన‌గాడేన‌న్న టాక్ వినిపిస్తోంది. నితిన్- రష్మిక మంద‌న జంట‌గా వెంకీ కుడుముల తెర‌కెక్కించిన భీష్మ తొలి మూడు రోజులు అద్భుత వ‌సూళ్ల‌ను సాధించి నాలుగో రోజూ అదే హ‌వా సాగించడం ఆశ్చ‌ర్య‌ ప‌రిచింది.

నాలుగో రోజు ఏకంగా 1.87 కోట్ల షేర్ వసూలు చేయ‌గా... తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల గ్రాండ్ టోటల్ 16.71 కోట్లకు చేరుకుంది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ సాధ్యమైంద‌న్న రిపోర్ట్ ఉంది. ఇక నితిన్ కెరీర్ బెస్ట్ హిట్ గానూ ఈ సినిమా రికార్డుల‌కెక్కుతోంది. ఇక విదేశీ వ‌సూళ్ల‌లోనూ భీష్మ హ‌వా సాగుతుండ‌డం ఆస‌క్తిని క‌లిగించేదే.

నాలుగో రోజు వ‌సూళ్ల తో పాటు నాలుగు రోజుల మొత్తం ఏరియా వైజ్ వ‌సూళ్ల లెక్క‌లు చూస్తే... నైజాజాం 71 ల‌క్ష‌లు.. సీడెడ్ 31 ల‌క్ష‌లు..నెల్లూరు 6 ల‌క్ష‌లు..గుంటూరు 14 ల‌క్ష‌లు..కృష్ణ 9.58 ల‌క్ష‌లు..వెస్ట్ 9 ల‌క్ష‌లు..తూర్పు 12 ల‌క్ష‌లు..యుఎ 34 ల‌క్ష‌లు.. మొత్తంగా 1.87 కోట్లు వ‌సూలైంది. నాలుగురోజుల మొత్తం చూస్తే.. నైజాం - 6.64 కోట్లు.. సీడెడ్ - 2.55 కోట్లు.. నెల్లూరు - 0.54 కోట్లు.. గుంటూరు - 1.51 కోట్లు.. కృష్ణ 1.05 కోట్లు.. ప‌.గో జిల్లా - 0.97 ల‌క్ష‌లు.. తూ.గో జిల్లా - 1.32 కోట్లు వ‌సూలైంది. ఉత్త‌రాంధ్ర - 2.13 కోట్లు క‌లుపుకుని మొత్తంగా 16.71 కోట్ల మొత్తం వ‌సూలైంద‌ని తెలుస్తోంది. పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మ‌రో రోజులో సాధ్య‌మేన‌న్న టాక్ ట్రేడ్ లో వినిపిస్తోంది.