Begin typing your search above and press return to search.

`భీష్మ` మొద‌టిరోజు వ‌సూళ్లు

By:  Tupaki Desk   |   22 Feb 2020 6:15 AM GMT
`భీష్మ` మొద‌టిరోజు వ‌సూళ్లు
X
యూత్ స్టార్ నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా సినిమా భీష్మ‌. ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌. వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ శుక్ర‌వారం సినిమా థియేట‌ర్ల‌లోకి రిలీజైన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. నితిన్ కెరీర్ లో మ‌రో బెస్ట్ ఓపెనింగ్ సాధ్య‌మైంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. భీష్మ తొలి రోజు 6.28 కోట్లు వ‌సూలు చేసింది. నితిన్ కి ఇదే బెస్ట్ అని చెబుతున్నారు

ఈ శ‌ని- ఆదివారాలు భీష్మకు వ‌సూళ్ల ప‌రంగా డోఖా ఉండ‌ద‌ని భావిస్తున్నారు. మొదటి రోజు ఏపీ-తెలంగాణ వ‌సూళ్ల లెక్క‌లు ప‌రిశీలిస్తే.. నైజాం 2.20 కోట్లు-సీడెడ్ 0.80 కోట్లు- వైజాగ్ 0.62 కోట్లు-గుంటూరు 0.77 కోట్లు-తూర్పు 0.66 కోట్లు-వెస్ట్ 0.56 కోట్లు-కృష్ణ 0.40 కోట్లు-నెల్లూరు 0.27 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా 6.28 కోట్ల మేర వ‌సూలైంది. ఓవ‌ర్సీస్ లో భీష్మ స్టామినాకి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాల వ‌సూళ్లు ఓకే. నితిన్ ఎన‌ర్జీ.. ర‌ష్మిక గ్లామ‌ర్ .. వెంకీ కుడుముల కామెడీ టైమింగ్.. ఇవ‌న్నీ సినిమాకి ప్ల‌స్ అయ్యాయి. మూవీ ఆద్యంతం వినోదం పండించ‌డం లో స‌ఫ‌ల‌మ‌య్యార‌న్న టాక్ వ‌చ్చింది. మ‌రో పెద్ద సినిమా రిలీజ‌య్యే వ‌ర‌కూ భీష్మ క‌లెక్ష‌న్ల‌కు డోఖా ఉండ‌క‌పోవ‌చ్చని విశ్లేషిస్తున్నారు.