Begin typing your search above and press return to search.

'భీష్మ' యూత్‌ కు మెసేజ్‌ ఇవ్వబోతున్నాడట

By:  Tupaki Desk   |   12 Feb 2020 10:30 AM IST
భీష్మ యూత్‌ కు మెసేజ్‌ ఇవ్వబోతున్నాడట
X
కుర్ర హీరోలు యూత్‌ కు మెసేజ్‌ ఇవ్వాలనుకోరు. ముఖ్యంగా నితిన్‌ వంటి యంగ్‌ బ్యాచ్‌ హీరోలు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ చేసేందుకే ఎక్కువ ప్రయత్నిస్తారు తప్ప మెసేజ్‌ లు ఇచ్చి యూత్‌ ను ఏదో ఉద్దరించేయాలనే ఉద్దేశ్యంను కలిగి ఉండరు. కాని నితిన్‌ తన భీష్మ చిత్రంలో యూత్‌ ఆడియన్స్‌ కోసం ఒక మెసేజ్‌ ను రెడీ చేసి పెట్టాడట. ఆ మెసేజ్‌ చెప్పినట్లుగా ఉండదు కాని.. అందరికి అర్థం అయ్యేలా ముఖ్యంగా యూత్‌ కు ఒక ఆలోచన కలిగేలా ఉంటుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇంతకు భీష్మ చిత్రంలో నితిన్‌ ఇవ్వబోతున్న మెసేజ్‌ ఏంటా అనుకుంటున్నారా.. యూత్‌ లో వ్యవసాయం ముఖ్యంగా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ పై ఆసక్తి కలిగించే సీన్స్‌ ఈ చిత్రంలో కొన్ని ఉంటాయట. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ వల్ల ఉపయోగాలు ఏంటీ.. అది చేయడం వల్ల యూత్‌ కు కలిగే ప్రయోజనం ఏంటీ అసలు ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ ఎందుకు చేయాలనే విషయాలను ఒక ప్రేమ కథలో భాగంగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తూనే దర్శకుడు వెంకీ కుడుముల చెప్పబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న నితిన్‌ ఎట్టకేలకు ఈ చిత్రంతో ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రంను సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ లో నిర్మించారు. ఛలో చిత్రం తర్వాత వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న సినిమా ఇదే అవ్వడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఇప్పటికే ఈ చిత్రంకు మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. నితిన్‌.. రష్మికల జోడీకి మంచి టాక్‌ వచ్చింది. కనుక సినిమా కూడా తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.