Begin typing your search above and press return to search.
చరణ్ ని హ్యాండిల్ చేయగలడా...?
By: Tupaki Desk | 21 July 2020 10:15 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ నటించబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే హోమ్ ప్రొడక్షన్ లో చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ మధ్య స్టార్ హీరోలందరూ వరుసపెట్టి న్యూ ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్న తరుణంలో చరణ్ నెక్స్ట్ మూవీ ఏమిటని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉండబోతోందనే న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
వెంకీ కుడుముల 'ఛలో' సినిమాతో డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల ఈ ఏడాది ప్రారంభంలో నితిన్ తో 'భీష్మ' సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో వెంకీ కుడుముల నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మెగా హీరో రామ్ చరణ్ కి వెంకీ కుడుముల ఇటీవల ఓ స్క్రిప్ట్ నేరేట్ చేసాడని తెలుస్తోంది. చరణ్ కి కూడా ఈ స్టోరీ నచ్చిందని.. చరణ్ నెక్స్ట్ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలోనే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో వెంకీ కుడుముల రామ్ చరణ్ 'తుఫాన్' సినిమాకి రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసారు. ఆ పరిచయంతో చరణ్ వెంకీ చెప్పిన స్టోరీ విని ఛాన్స్ ఇచ్చాడని అనుకుంటున్నారు. అయితే డైరెక్టర్ గా రెండు సినిమాల అనుభవం ఉన్న వెంకీ కుడుముల స్టార్ హీరో చరణ్ ని హ్యాండిల్ చేయగలడా అని మెగా అభిమానులు కలవరపడుతున్నారు. మరి రామ్ చరణ్ - వెంకీ కుడుముల ప్రాజెక్ట్ పై వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.