Begin typing your search above and press return to search.

నాగ శౌర్య గురించి వెంకీ ఏమన్నాడంటే ?

By:  Tupaki Desk   |   20 Feb 2020 11:00 PM IST
నాగ శౌర్య గురించి వెంకీ ఏమన్నాడంటే ?
X
మొన్నీ మధ్య నాగ శౌర్య దర్శకుడు వెంకీ కుడుముల గురించి చేసిన కామెంట్స్ తీవ్ర దూమారం లేపాయి. తనకి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని శౌర్య మీడియా ముందు బ్లేం చేస్తూ మాట్లాడటం అందరినీ షాక్ అయ్యేలా చేసాయి. అయితే రిలీజ్ కి ముందే తనను అవైడ్ చేశాడంటూ చెప్పుకొచ్చిన శౌర్య ఛలో కథలో తన భాగం ఉందని వెంకీ ఓ దరిద్రమైన కథ తీసుకొస్తే తను ఛలో పాయింట్ రైజ్ చేసానని అన్నాడు.

అయితే ఈ విషయాన్ని మీడియా డైరెక్టర్ ని వెంకీ ముందు పెట్టగా దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదన్నట్టుగా దాటేసాడు. మా ఇద్దరి మధ్య జరిగిన పర్సనల్ విషయం తెలుసుకోవడానికి జనాలు అంత ఆసక్తి చూపించారని మీరు కూడా దాన్ని లైట్ తీసుకోవడం బెటర్ అన్నట్టుగా మాట్లాడాడు. సో వెంకీ మాటల్లో తనకి మొదటి అవకాశం ఇచ్చిన హీరోను బ్లేం చేయడం ఇష్టం లేదన్న సంగతి అర్థమవుతుంది.

నిజానికి శౌర్య ఏదో ఫ్లోలో తమ మధ్య జరిగిన విషయాలు బయట పెట్టేసాడు. అదే విధంగా వెంకీ కూడా తన వర్షన్ చెప్పి అసలు ఏం జరిగిందో చెప్పేస్తే శౌర్య కి ఎంతో కొంత బ్యాడ్ జరిగేది. అందుకే వెంకీ ఈ విషయం లో సైలెంట్ మైంటైన్ చేస్తున్నాడు. ఏదేమైనా తనకి ఓ సూపర్ హిట్ ఇచ్చాడంటూ నెత్తిన పెట్టుకొని సక్సెస్ మీట్ లో కారు కూడా ఇచ్చిన శౌర్య ఉన్నపళంగా వెంకీ కి టాలెంట్ లేదంటూ ఏదో చెప్పడం జనాలకు నవ్వు తెప్పిస్తుంది.