Begin typing your search above and press return to search.

నో కామెంట్ అంటూనే నోరు జారాడు

By:  Tupaki Desk   |   20 Feb 2020 9:30 AM GMT
నో కామెంట్ అంటూనే నోరు జారాడు
X
యంగ్ హీరో నాగ‌శౌర్య .. ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల మ‌ధ్య త‌లెత్తిన `క్రెడిట్ వివాదం` ముదిరిపాకాన ప‌డిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన హిట్టు చిత్రం `ఛ‌లో` స్క్రిప్ట్ క్రెడిట్ విష‌యంలో నాగ‌శౌర్య మొత్తం త‌న ఖాతాలో వేసుకోవ‌డం డైరెక్ట‌ర్ కోపానికి కార‌ణ‌మైంది. ఛ‌లో స్క్రిప్ట్ లో త‌న హ‌స్తం ఉంద‌ని.. కానీ వెంకీ క్రెడిట్ మొత్తం కొట్టేశాడు! అంటూ శౌర్య వ్యాఖ్యానించ‌డంతో వివాదం తారా స్థాయికి చేరుకుంది. అనంత‌రం ఆగ‌కుండా ఈ గొడ‌వ‌లు సీక్వెల్ లా సాగాయి. నాగ‌శౌర్య‌.... మ‌ళ్లీ వెంకీ కుడుముల‌ను ప‌బ్లిక్ వేదిక‌ల‌పై టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇక‌పై త‌న‌ కాంపౌండ్ లో అడుగు పెట్ట‌నివ్వ‌న‌ని... వెంకీ ఒక‌ మోస‌గాడు అని మ‌రో సంద‌ర్భంలో వ్యాఖ్యానించారు శౌర్య‌.

అయితే ఈ వ్యాఖ్య‌ల‌ను అప్ప‌ట్లో వెంకీ సీరియ‌స్ గా తీసుకోలేదు. త‌న సినిమా భీష్మ బిజీలో ఇవేవీ ప‌ట్టించుకోలేదు. అయినా వెంకీ-నాగ‌శౌర్య మ‌ధ్య వివాదం ఉంద‌న్న విష‌యం కూడా నాగౌశ‌ర్య మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వూల ద్వారానే తెలిసింది. అయితే తాజాగా భీష్మ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వూల్లో వెంకీ కుడుముల‌ను ఆ వివాదంపై స్పందించాల్సిందిగా మీడియా కోరినా..అత‌ను నో కామెంట్ అనేసాడు. ఎవ‌రి క్రెడిట్ ని తాను కొట్టేయ‌లేద‌ని...క్రెడిట్ ఇవ్వ‌ని వ్య‌క్తిని కాద‌ని...దీనిపై `నో కామెంట్` అని అనేశాడు.

వెంకీ కుడుమ‌లు ఇప్పుడిప్పుడే ద‌ర్శ‌కుడిగా ఎదుగుతున్నాడు. మేకర్ గా త‌న‌కు బోలెడంత భ‌విష్య‌త్ ఉంది. అందుకే ఈ వివాదం పై వెంకీ స్పందించ‌డం లేదు అని భావించాల్సి ఉంటుంది. అయినా ప‌రిశ్ర‌మ‌లో వివాదాల‌తో అంట‌కాగేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. అది మంచిది కాదు కూడా. అందుకే వీలైనంత వ‌ర‌కూ కూల్ గా...కామ్ గా వెళ్లిపోవాల‌ని చూస్తారు. చాలా రేర్ గా మాత్ర‌మే నోరు జారి హైలైట్ అవుతుంటారు. నాగ‌శౌర్య కూడా కూల్ గ‌య్... కానీ ఎందుక‌నో ఆక్ష‌ణంలో అలా నోరు జారి మీడియాలో హైలైట్ అయ్యాడు. ఇప్పుడు అదే త‌ప్పు వెంకీ చేయ‌క‌పోవ‌డం మంచిదేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అన్న‌ట్టు వెంకీ నో కామెంట్ అంటూనే క్రెడిట్ కొట్టేయ‌లేద‌న్నాడుగా!!