Begin typing your search above and press return to search.

తెలివైన పిల్ల... హీరోలని వారి ఫ్యాన్స్ ని హర్ట్ చేయడం లేదు...!

By:  Tupaki Desk   |   29 April 2020 10:45 AM IST
తెలివైన పిల్ల... హీరోలని వారి ఫ్యాన్స్ ని హర్ట్ చేయడం లేదు...!
X
ప్రస్తుతం టాలీవుడ్‌ లో క్రేజీ హీరోయిన్‌ ఎవరు అంటే.. టక్కున గుర్తొచ్చేది క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న‌ అని చెప్పవచ్చు. 'ఛ‌లో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో ఛలోమంటూ దూసుకుపోతోంది. 'గీత గోవిందం'తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన 'డియ‌ర్ కామ్రేడ్‌' 'దేవ‌దాస్‌' సినిమాలు ప‌ర‌వాలేద‌నిపించినా.. 'స‌రిలేరు నీకెవ్వ‌రు' 'భీష్మ' చిత్రాలు భారీ విజ‌యాల్ని సొంతం చేసుకొని ఆమెకి టాలీవుడ్ లో సరిలేరు అనిపించుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న 'పుష్ప'లో నటిస్తోంది. లాక్‌ డౌన్ కారణంగా ఇంట్లోనే టైమ్ స్పెండ్ చేస్తున్న రష్మిక మందన్న అందరూ సెలబ్రెటీల లాగే ఇన్స్టాగ్రామ్ లో తన అభిప్రాయాలను ఫ్యాన్స్‌ తో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చింది. లాక్‌ డౌన్ తర్వాత మొదటగా చేసే పని ఏమిటంటే.. వెళ్లి తన స్నేహితులను కలుస్తానని చెప్పింది. వంట ఏమాత్రం వచ్చన్న మరో అభిమాని ప్రశ్నకు కేకులు సీట్స్ చేస్తా అని సమాధానం ఇచ్చింది. విజయ్ దేవరకొండ మరియు నితిన్ లలో ఎవరంటే మీకు ఇష్టమని అడుగగా 'మీకు ఎవరంటే ఇష్టం' అంటూ సమాధానం దాటవేసింది. తెలివైన పిల్ల కదా.. అటు ఫ్యాన్స్ ని ఇటు హీరోలను హర్ట్ చేయకుండా సమాధానం చెప్పింది. మీ దగ్గర ఎన్ని కుక్కలున్నాయి అని అడుగగా 'తన దగ్గర 5 పెంపుడు కుక్కులున్నాయని.. వాటితో పాటు 8 కుక్క పిల్లలు కూడా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. 'మీ బెడ్ రూమ్ చూపించమని' అడుగగా 'అది నా ప్రైవేట్ ప్లేస్' అంటూ చెప్పింది.

ఇక తమిళంలో నటిస్తారా అనే దానికి 'ఇప్పటికే ఓ సినిమా చేశాను.. కానీ లాక్‌ డౌన్ కారణంగా విడుదల కాలేదని' చెప్పుకొచ్చింది. ఓ అభిమాని ఏకంగా 'ఆ దేవుడు నాకు ఎదురైతే.. రష్మికకు భర్త చేయమని కోరుతా' అని చెప్పాడు. దానికి రష్మిక అంతే స్థాయిలో తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను చూపిస్తూ.. 'ముందు దీని పర్మిషన్ తీసుకో' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. 'పుష్ప' కోసం కొత్త యాస నేర్చుకుంటున్నారట కదా అని అడగ్గానే మీకు ఎలా తెలుసన్నట్లు 'ఆశ్చర్య పోతున్న' ఎమోజి పెట్టింది రష్మిక. దీంతో ర‌ష్మిక గ్రామీణ యువ‌తిగా చిత్తూరు అమ్మాయిగా క‌నిపించ‌బోతోందని అర్థం అవుతోంది.