Begin typing your search above and press return to search.

యాక్ష‌న్ ప్యాక్డ్ `భీమ్లా నాయ‌క్` ప‌రుగులే

By:  Tupaki Desk   |   12 Oct 2021 11:24 AM IST
యాక్ష‌న్ ప్యాక్డ్ `భీమ్లా నాయ‌క్` ప‌రుగులే
X
పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- యంగ్ హంక్ రానా ప్ర‌ధానా పాత్ర‌లో సాగ‌ర్ .కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లానాయ‌క్`. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ప‌వ‌న్...రానా పాత్ర‌లు ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటాయో ఫ‌స్ట్ గ్లింప్స్ వీక్షించాక అర్థ‌మైంది. ఈ రెండు పాత్ర‌లు ఒక‌దానితో ఒక‌టి పోటా పోటీగా సాగుతాయ‌ని ఓ క్లారిటీ ఉంది. ఇక షూటింగ్ విష‌యానికి వ‌స్తే చిత్రీక‌ర‌ణ కూడా తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ప‌వ‌న్ -రానా మధ్య ప్యాక్డ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు షూట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. భీమ్లా నాయ‌క్ అనే పోలీసాఫీస‌ర్ గా ప‌వ‌న్.. డేనియ‌ల్ శేఖ‌ర్ అనే పెద్ద‌మ‌నిషిగా రానా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

సినిమాలో ఈ ఇరువురి న‌డుమా ఈగో గొడ‌వ‌లు ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ స‌న్నివేశాలు హైలైట్ కానున్నాయ‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య ఈగో గొడ‌వ‌లు పోరు హోరా హోరీగా సాగుతుంద ని..రెండు పాత్ర‌లు పోటా పోటీగా ఉంటాయ‌ని అంటున్నారు. ఇంత‌కుముందు విమ‌ర్శలు వ‌చ్చిన‌ట్టుగా.. ఏ పాత్ర‌ను త‌క్కువ చేయ‌లేద‌ని.. క‌మ‌ర్శియ‌ల్ అంశాల‌కు దూరంగానే స్క్రిప్ట్ ఉన్న‌ట్లు స‌మాచారం. తాజా షెడ్యూల్ తో చిత్రీక‌ర‌ణ చాలా భాగం పూర్త‌యిన‌ట్లేన‌ని తెలుస్తోంది. మేక‌ర్స్ స్పీడ్ చూస్తుంటే షూటింగ్ వేగంగానే జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. షూటింగ్ ప్రారంభ‌మైన త‌ర్వాత ఎక్క‌డా స‌మ‌యం వృథా కాకుండా టీమ్ జాగ్ర‌త్త ప‌డుతూ వీలైనంత త్వ‌రగా షూట్ ని పూర్తిచేసే ప‌నిలో నిమ‌గ్నమైన‌ట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఇచ్చిన డేట్ల ప్ర‌కారం షూటింగ్ యథావిథిగా ఎలాంటి మార్పులు లేకుండా చ‌క‌చ‌కా జ‌రిగిపోతుంద‌ని స‌మాచారం. ఇందులో వ‌వ‌న్ కి జోడీగా నిత్యా మీన‌న్ న‌టిస్తుండగా..రానాకు జంటగా సంయుక్త మీన‌న్ న‌టిస్తోంది. సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.