Begin typing your search above and press return to search.

భీమ్లా నాయక్ ట్రైలర్ ట్రీట్ కి రెడీనా?

By:  Tupaki Desk   |   5 Feb 2022 4:30 AM GMT
భీమ్లా నాయక్ ట్రైలర్ ట్రీట్ కి రెడీనా?
X
వ‌కీల్ సాబ్ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి అద్భుత‌మైన ట్రీట్ ఉంటుంద‌ని అభిమానులు ఆశించారు. అత‌డు న‌టించిన భీమ్లా నాయ‌క్ పోస్ట‌ర్లు టీజ‌ర్ లు క్రియేట్ చేసిన హైప్ దృష్ట్యా సంక్రాంతి కి స్పెష‌ల్ ట్రీట్ ఖాయ‌మైంద‌ని అంతా ఆనందించారు. ఇంత‌లోనే ర‌క‌ర‌కాల ప‌రిస్థితులు సినిమా వాయిదాకి కార‌ణ‌మైన సంగ‌తి తెలిసిందే. కోవిడ్ ఒక‌వైపు.. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డైల‌మా మ‌రోవైపు భీమ్లా నాయ‌క్ వాయిదాకి కార‌ణ‌మ‌య్యాయి.

ఆ త‌ర్వాత కొత్త తేదీ కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూసారు. కానీ ఇప్ప‌టికీ దీనిపై స్ప‌ష్ఠ‌త లేదు. డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా మేక‌ర్స్ నుంచి ఒక తేదీ ఫిక్స‌వ్వ‌లేదు. కోవిడ్ పరిస్థితుల్ని బట్టి ఈ చిత్రం ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల కానుందని మాత్రం ప్ర‌క‌టించారు. అయితే రిలీజ్‌ తేదీతో సంబంధం లేకుండా మేకర్స్ ట్రైలర్ ను లాక్ చేసినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 20 సెకన్లు ఉండ‌నుంది. పవన్ కళ్యాణ్ హై ఆక్టేన్ యాక్షన్ బ్లాక్ లు .. ఎలివేషన్ షాట్ లతో నిండి ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్- రానా ఇద్దరూ సమాన స్క్రీన్ స్పేస్ ను ట్రైల‌ర్ లో క‌ల్పించారు. ఆ ఇద్దరి మ‌ధ్యా ఘర్షణ సన్నివేశాలు ఈ ట్రైలర్ లో హైలైట్ అవుతాయని తెలుస్తోంది. థమన్ ఘనమైన బీజీఎం కూడా ఈ ట్రైలర్ మరో ప్రధాన అసెట్ కానుంది.

భీమ్లా నాయక్ కి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు అందించారు. ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌కుడిగానూ ఆయ‌న కొన‌సాగారు. తమన్ సంగీతం సమకూర్చారు. నిత్యామీన‌న్ ఇందులో ప‌వ‌న్ కి జ‌త‌గా క‌నిపించ‌నుంది.