Begin typing your search above and press return to search.

భీమ్లా నాయక్‌ షూటింగ్ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   18 Aug 2021 4:30 PM GMT
భీమ్లా నాయక్‌ షూటింగ్ అప్‌డేట్‌
X
మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కు రీమేక్‌ గా రూపొందుతున్న 'భీమ్లా నాయక్‌' సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా కాస్త ఆలస్యం అవుతోంది. ఇదే సమయంలో కొన్ని టెక్నికల్‌ సమస్యల కారణంగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మళ్లీ షూట్‌ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్నట్లుగానే భీమ్లా నాయక్‌ లోని కొన్ని మాస్ సన్నివేశాలను ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ లుంగీ కట్టుకుని వచ్చే సన్నివేశాలను మరింత పవర్‌ ఫుల్ గా తెరకెక్కించేందుకు గాను రీ షూట్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

భీమ్లా నాయక్‌ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ఇటీవలే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ ను ఈ నెలలో పూర్తి చేసేలా మొదట ప్లాన్‌ చేసినా కూడా కొన్ని సన్నివేశాల రీ షూట్ వల్ల ఈ నెలలు షూటింగ్‌ ముగుస్తుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ భీమ్లా నాయక్‌ లుక్‌ కు మంచి స్పందన వచ్చింది. సినిమా లుక్‌ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి.

పవన్ తో పాటు రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. మంచి సమయం సందర్బం చూసి భీమ్లా నాయక్ సినిమా లో రానా లుక్ ను కూడా రివీల్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా కు సంబంధించిన మాస్ సన్నివేశాల చిత్రీకరణ చేపట్టిన నేపథ్యంలో తదుపరి మరో షెడ్యూల్‌ తో సినిమా పూర్తి అవుతుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. వరుసగా పవన్‌ చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి భీమ్లా నాయక్ రాబోతుండగా.. సమ్మర్ లో హరి హర వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది. ఇక వచ్చే ఏడాది చివరికి హరీష్‌ శంకర్‌ మూవీ కూడా వస్తుందని అంటున్నారు.