Begin typing your search above and press return to search.

భీమ్లా నాయక్ వెనక్కి త‌గ్గేదే లే అంటున్నాడు!

By:  Tupaki Desk   |   26 Oct 2021 4:32 AM GMT
భీమ్లా నాయక్ వెనక్కి త‌గ్గేదే లే అంటున్నాడు!
X
సంక్రాంతి 2022 రిలీజ్ బ‌రిలో భారీ క్రేజీ చిత్రాలు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌దానిని మించి ఒక‌టి అన్న చందంగా పాన్ ఇండియా క్రేజ్ తో ఈ సినిమాల‌న్నీ విడుద‌ల‌వుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ - రాధేశ్యామ్ - స‌ర్కార్ వారి పాట చిత్రాలు రేసులో ఉన్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ `భీమ్లా నాయ‌క్` వీళ్లంద‌రికంటే ముందే సంక్రాంతి వార్ ని ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

RRR- జ‌న‌వ‌రి 07 న విడుద‌ల‌వుతుంద‌గా.. స‌ర్కార్ వారి పాట జ‌న‌వ‌రి 13న విడుద‌ల‌వుతోంది. ప్ర‌భాస్ న‌టిస్తున్న రాధేశ్యామ్ జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఇంత పోటీ న‌డుమ భీమ్లా నాయ‌క్ వెన‌క్కి త‌గ్గుతున్నారు! అంటూ ఇటీవ‌ల ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఇది నిజ‌మా? అంటే కానేకాదు.

అయితే ఈ క‌థ‌నాలేవీ నిజాలు కావు. భీమ్లా నాయ‌క్ త‌గ్గేదే లే అంటూ వార్ జోన్ లోకి వ‌చ్చేస్తున్నాడు. 2022 జ‌న‌వ‌రి 12న ముందే ప్ర‌క‌టించిన‌ట్టే చెప్పిన టైమ్ కే వ‌చ్చేస్తున్నాడు. ఇత‌ర భారీ చిత్రాల‌కు ధీటుగా థియేట‌ర్ల‌ను లాక్ చేసేందుకు నిర్మాత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. పవన్ కళ్యాణ్- రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న `భీమ్లా నాయక్` ప్రణాళికలను మార్చే ఆలోచ‌న లేద‌ని .. ఏది ఏమైనా సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా విజ‌యం సాధిస్తుందని నిర్మాత నాగ వంశీ ధృవీకరించారు.

``భీమ్లా నాయ‌క్ & #డేనియ‌ల్ శేఖ‌ర్ అల్టిమేట్ క్లాష్ తీవ్రతతో 2022 జనవరి 12న బిగ్ స్క్రీన్ వెలిగిపోతుంది`` అంటూ సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నాగ‌వంశీ ట్వీట్ చేశారు. రేసు నుండి తగ్గేదే లేద‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌భాస్ - మ‌హేష్ లాంటి టాప్ స్టార్ల సినిమాలు ఉన్నా బ‌రిలో నాయ‌క్ ఉంటాడ‌ని క్లారిటీ ఇచ్చేసారు నిర్మాత‌. ఇది నిజంగా ప‌వ‌న్ అభిమానుల్లో జోష్ పెంచే మాట అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే భారీ సినిమాలు కేవ‌లం రోజు గ్యాప్ తోనే వ‌స్తున్నాయి కాబ‌ట్టి థియేట‌ర్ల‌ను స‌ర్ద‌డం అన్న‌దే ఇప్పుడు స‌మ‌స్యాత్మ‌కం. ప్రైమ్ ఏరియాల్లో థియ‌ట‌ర్ల‌ను లాక్ చేసేందుకు ఇప్ప‌టికే ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని తెలిసింది. #RRRకి ఇప్పటికే చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు అండ‌గా నిలిచారు. హిందీ రిలీజ్ కోసం చెప్పుకోద‌గ్గ థియేట‌ర్ల‌ను లాక్ చేస్తున్నార‌ని తెలిసింది. అయితే భీమ్లానాయ‌క్ కి తెలుగు రాష్ట్రాల పంపిణీ వ‌ర్గాలు - ఎగ్జిబిట‌ర్ల నుంచి ఏ మేర‌కు అండ ఉంది అన్న‌ది తెలియాల్సి ఉంది. తీవ్ర‌ పోటీ న‌డుమ రిలీజ‌వుతున్నా తొలి మూడు రోజుల వ‌సూళ్లు చాలా ఇంపార్టెంట్. ఓపెనింగులు రికార్డులు కొట్టాలంటే క‌చ్ఛితంగా థియేట‌ర్ల సంఖ్య భారీగా ఉంటేనే సాధ్యం. ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ నిర్మాణానంత‌ర ప‌నుల్ని శ‌ర‌వేగంగా పూర్తి చేసేందుకు త్రివిక్ర‌మ్ - సాగ‌ర్ చంద్ర బృందం త‌మ ప‌నిలో తాము ఉన్నారు. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నాటికే మెజారిటీ ప‌నులు పూర్త‌వుతాయ‌ని భావిస్తున్నారు. ప‌వ‌న్ స‌ర‌స‌న ఈ చిత్రంలో నిత్యామీన‌న్ నాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక ఈగోయిస్టిక్ పెద్ద మ‌నిషితో పోలీసాఫీస‌ర్ సాగించిన అల్టిమేట్ వార్ ఏమిట‌న్న‌ది తెర‌పై చూడాల్సిందే. ఇందులో డేనియ‌ల్ శేఖ‌ర్ అనే పెద్ద మ‌నిషిగా రానా న‌టిస్తున్నారు. వృత్తి ప‌రంగా సిన్సియ‌ర్ అయిన పోలీసాఫీస‌ర్ భీమ్లానాయ‌క్ అత‌డితో ఎలాంటి ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే. ఈ రెండు పాత్ర‌లు నువ్వా నేనా? అంటూ వార్ న‌డిపిస్తాయ‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు.