Begin typing your search above and press return to search.

'అన్నయ్య' కోసం 'తమ్ముడు' త్యాగం చేస్తున్నాడా..?

By:  Tupaki Desk   |   19 Aug 2021 10:30 AM GMT
అన్నయ్య కోసం తమ్ముడు త్యాగం చేస్తున్నాడా..?
X
టాలీవుడ్ లో 2022 సంక్రాంతి బెర్తుల కోసం ఐదు నెలల ముందు నుంచే పోటీ ఎక్కువైంది. ఇప్పటికే మూడు స్టార్ హీరోల సినిమాలు విడుదల తేదీలను కూడా ప్రకటించారు. జనవరి 12న పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' - 13న మహేష్ బాబు 'సర్కారు వారి పాట' - 14న ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా అదే సమయంలో వెంకటేష్ 'ఎఫ్ 3' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. వచ్చే పెద్ద పండక్కి ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉంటాయని ఆడియన్స్ మైండ్ లో ఫిక్స్ అయ్యారు.

అయితే ఇప్పుడు సడన్ గా సంక్రాంతి రిలీజులలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ''భీమ్లా నాయక్'' సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని.. దీనికి మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా కారణమని అంటున్నారు. సమ్మర్ లో విడుదల కావాల్సిన 'ఆచార్య' చిత్రాన్ని కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. అయితే అన్ని పెద్ద సినిమాలు తదుపరి రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తున్నా.. చిరు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు.

ఇప్పుడు ఉన్నట్టుండి 'ఆచార్య' చిత్రాన్ని వచ్చే సంక్రాంతి పందెంలో నిలపాలని భావిస్తున్నారట. అందుకే 'భీమ్లా నాయక్' ను రిపబ్లిక్ డే వీక్ కు షిఫ్ట్ చేసి.. జనవరి 12న 'ఆచార్య' ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి దీని గురించే డిస్కషన్ జరుగుతోంది. 'ఆర్.ఆర్.ఆర్' ఎలాగూ దసరా ఫెస్టివల్ కు వచ్చే అవకాశం లేదు కాబట్టి.. ఆ సమయంలో చిరంజీవి సినిమాని రిలీజ్ చేస్తే సరిపోతుందని పీకే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు 'ఆచార్య' చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేసుకోగా.. సడన్ గా 'భీమ్లా నాయక్' రిలీజ్ డేట్ ఇచ్చారని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ సినిమా ఎప్పుడు విడుదల అవ్వాలనే దాని గురించి ట్విట్టర్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి అన్నయ్య సినిమా కోసం తమ్ముడు రిలీజ్ డేట్ ని త్యాగం చేస్తాడో లేదో చూడాలి. ఇకపోతే విడుదల తేదీల గందరగోళంపై చిత్ర బృందాలు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. 'ఆచార్య' రిలీజ్ డేట్ ఇచ్చేస్తే ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుందని చెప్పవచ్చు.