Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్..?

By:  Tupaki Desk   |   22 Jan 2022 9:30 AM GMT
భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్..?
X
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద క్లాష్ ని నివారించడానికి వాయిదా వేశారు. ఈ క్రమంలో 2022 ఫిబ్రవరి 25న ఈ రీమేక్ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

'భీమ్లా నాయక్' సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పిన తేదీకి విడుదల చేయడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కాస్త పెండింగ్ ఉంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్టార్ హీరో సెట్స్ లో అడుగుపెట్టడానికి ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని 'భీమ్లా నాయక్' సినిమా విడుదల కోసం మరో తేదీని లాక్ చేయాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఫిబ్రవరి 25న సినిమాని థియేటర్స్ లోకి తీసుకురాలేకపోతే.. ఏప్రిల్ 1న తీసుకొచ్చే సాధ్యాసాధ్యాలపై మేకర్స్ ఆలోచన చేస్తున్నారట. కాకపోతే అదే డేట్ ని ఇప్పటికే మహేష్ బాబు 'సర్కారు వారి పాట' - చిరంజీవి 'ఆచార్య' చిత్రాల కోసం లాక్ చేశారు. ఒకవేళ మహేష్ తో పోటీకి రెడీ అయినా.. సోదరుడు చిరుతో మాత్రం పవన్ తలపడడానికి ఇష్ట పడకపోవచ్చు.

దీనిని బట్టి 'ఆచార్య' వాయిదా పడితేనే 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి. కాగా, మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ గా పవన్ - రానా ల సినిమా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.