Begin typing your search above and press return to search.

#PSPKRana అప్డేట్: లుంగీ కట్టి రంగంలో దిగిన భీమ్లా నాయక్..!

By:  Tupaki Desk   |   13 Aug 2021 11:30 AM GMT
#PSPKRana అప్డేట్: లుంగీ కట్టి రంగంలో దిగిన భీమ్లా నాయక్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా హీరోలుగా #PSPKRana అనే వర్కింగ్ టైటిల్ తో ఓ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. ఇందులో భీమ్లానాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కనిపించనున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన లుక్ ని మేకింగ్ వీడియో ద్వారా రివీల్ చేశారు. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ సింగిల్ మరియు ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో సాలిడ్ అప్డేట్ తో మేకర్స్ వచ్చారు.

'#PSPKRana' చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ఉదయం గం.09:45 నిమిషాలకు పవర్ స్ట్రామ్ రాబోతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 'ఈసారి మాములుగా ఉండదు మరి, పూనకాలే' అంటూ పవన్ కళ్యాణ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో పవన్ లుంగీని పైకి పట్టుకొని ముందుకు కదులుతున్నాడు. బ్యాక్ సైడ్ లుక్ అయినప్పటికీ పవన్ ఇలా దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా 'ఏకే' రీమేక్ కు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. రవి కె.చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.12 గా ఈ సినిమా రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. #PSPKRana చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.