Begin typing your search above and press return to search.

భీమ్లానాయక 2 మిలియన్‌ లతో ఆల్ ఇండియా రికార్డ్‌

By:  Tupaki Desk   |   12 Sep 2021 3:30 PM GMT
భీమ్లానాయక 2 మిలియన్‌ లతో ఆల్ ఇండియా రికార్డ్‌
X
పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న భీమ్లా నాయక్‌ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్‌ గ్లింప్స్ మరియు టైటిల్‌ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఫస్ట్‌ గ్లింప్స్ లో పవన్ లుంగీ ఎగ్గట్టి వస్తూ సీరియస్ గా డైలాగ్‌ చెప్పడం అభిమానులకు పిచ్చెక్కించింది. మాస్ ఆడియన్స్ కు ఇది కదా కావాల్సింది అంటూ అభిమానులు ఫిదా అయ్యారు. ఆ వెంటనే భీమ్లా నాయక్‌ టైటిల్‌ సాంగ్ వచ్చింది. థమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి పాట రేంజ్ ను పెంచేశాడు. తక్కువ సమయంలోనే మిలియన్ లైక్స్ ను దక్కించుకున్న పాట రెండున్నర కోట్లకు పైగా వ్యూస్ ను దక్కించుకుని ఇంకా కూడా యూట్యూబ్‌ టాప్ ట్రెండ్స్ లో కొనసాగుతుంది. చూడబోతుంటే సినిమా విడుదల సమయంకు వంద మిలియన్ ల వ్యూస్ వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. పాట విజువల్స్ కూడా అద్బుతంగా ఉండటంతో యూట్యూబ్‌ లో అభిమానులు పదే పదే భీమ్లా నాయక్ పాటను చూస్తున్నారు. ఇదే సమయంలో భీమ్లానాయక్ ఫస్ట్‌ గ్లింప్స్ కు అరుదైన రికార్డ్‌ దక్కింది.

కేవలం 50 సెకన్ల వీడియో అయిన భీమ్లా నాయక్‌ ఫస్ట్‌ గ్లింప్స్ కు రెండు కోట్ల వ్యూస్ రావడంతో పాటు ఏకంగా మిలియన్ లైక్స్ దక్కాయి. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ మరియు ఫస్ట్‌ గ్లింప్స్ కు మిలియన్ మరియు మిలియన్ చొప్పున రెండు మిలియన్ ల లైక్స్ దక్కాయి. ఇది అరుదైన రికార్డ్‌. ఒక సినిమా ఫస్ట్‌ గ్లింప్స్ కు ఇంత భారీగా లైక్స్ రావడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ సినిమా కే చెందింది అంటూ అభిమానులు చెబుతున్నారు. మేకర్స్ కూడా ఆల్ ఇండియా రికార్డ్‌ అంటూ ఒక పోస్టర్‌ ను అఫిషియల్‌ గా రిలీజ్ చేశారు. యూట్యూబ్‌ థమ్ నైల్‌ కూడా మోస్ట్‌ లైక్డ్ గ్లింగ్స్ అంటూ మార్చారు. మొత్తానికి ఆల్‌ ఇండియా రికార్డు దక్కించుకుంది అంటూ అఫిషియల్ గా భీమ్లా నాయక్‌ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్న నేపథ్యంలో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. పవన్‌ తో పాటు రానా కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రానా మరియు పవన్ ల మద్య ఉండే సన్నివేశాలు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పవన్‌ కు జోడీగా ఈ సినిమాలో నిత్యా మీనన్ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. చాలా డీ గ్లామర్‌ లుక్ లో నిత్యా మీనన్ కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి కుమ్మేయడం ఖాయం అని.. కేవలం యూట్యూబ్‌ రికార్డులు మాత్రమే కాకుండా టాలీవుడ్ బాక్సాఫీస్ ఆల్‌ టైమ్ రికార్డులు కూడా దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.