Begin typing your search above and press return to search.

ప్రతాపరెడ్డి కొత్త సినిమా టీజర్ చూశారా?

By:  Tupaki Desk   |   20 Jan 2023 7:28 AM GMT
ప్రతాపరెడ్డి కొత్త సినిమా టీజర్ చూశారా?
X
వీర సింహారెడ్డి సినిమాతో దునియా విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కన్నడ నాట స్టార్ హీరోగా వెలుగొందుతున్న దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కెరియర్లో ముందుగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినీ రంగంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన విజయ్ కుమార్... దునియా సినిమాతో మొట్టమొదటి హిట్ అందుకున్నాడు. తరువాత చందా, జంగ్లీ, జానీ మేరా నామ్ ప్రీతి మేరా కామ్, జయమ్మన మగా సినిమాలతో కన్నడలో స్టార్ హీరో అనిపించుకుంటూ సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.

ఇక తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న భీమా అనే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ ఫస్ట్ లుక్ టీజర్ లో దునియా విజయ్ తనదైన స్టైల్ లో బైక్ మీద రేసింగ్ చేస్తూ కనిపించాడు. ఇక తనదైన స్టైల్ లో డైలాగులు కూడా చెబుతూ ఈ టీజర్ ద్వారా తన ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు విజయ్.

దునియా విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని కృష్ణ క్రియేషన్స్ జగదీష్ ఫిలిమ్స్ అనే బ్యానర్ ల మీద కృష్ణ సార్ధక జగదీష్ గౌడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బీమా పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో దునియా విజయ్ ముసలిమడుగు ప్రతాపరెడ్డి అనే ఒక పాత్రలో నటించారు.

నందమూరి బాలకృష్ణ పక్కన అంతే పవర్ఫుల్ విలన్ కావాలని భావించిన గోపీచంద్ మల్లిని ఎన్నో వెతుకులాటల అనంతరం దునియా విజయ్ ను ఫైనల్ చేశారు. దునియా విజయని తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ క్రేజ్ మరో లెవల్ కి వెళ్లిందని చెప్పాలి.

వీర సింహారెడ్డి సినిమాతో దునియా విజయ్ కి తెలుగులో కూడా మార్కెట్ ఏర్పడిన నేపథ్యంలో భీమా సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన ఆశ్చర్యం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.