Begin typing your search above and press return to search.

డ‌బ్బింగ్ సినిమాల రుచి మ‌రిగిన గీతా?

By:  Tupaki Desk   |   2 Nov 2022 9:50 AM GMT
డ‌బ్బింగ్ సినిమాల రుచి మ‌రిగిన గీతా?
X
జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తూ యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసుతో క‌లిసి మినిమ‌మ్ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. అయితే రీసెంట్ గా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూష‌న్ లో క‌న్న‌డ సినిమా 'కాంతార‌'ని అల్లు అర‌వింద్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. రిష‌బ్ శెట్టి న‌టించి తెర‌కెక్కించిన ఈ మూవీ తెలుగులో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ స్టిల్ అదే జోరుని చూపిస్తోంది.

డ‌బ్బింగ్ సినిమా 'కాంతార‌' కాసుల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ వారి క‌న్ను మ‌రో హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీపై ప‌డింది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ పై అల్లు అర‌వింద్ తాజాగా ఓ హిందీ సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నారు.

వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన హార‌ర్ కామెడీ ఫిల్మ్ 'భేదియా'. ఈ చిత్రానిరి అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్ర‌ద్దా క‌పూర్‌, రాజ్ కుమార్ రావు న‌టించిన 'స్త్రీ', జాన్వీ క‌పూర్, రాజ్ కుమార్ రావు క‌లిసి న‌టించిన హార‌ర్ కామెడీ 'రూహీ' వంటి సినిమాల‌ని నిర్మించిన దీనేష్ విజన్ హ‌ర‌ర్ కామెడీ యూనివ‌ర్స్ లో భాగంగా ఈ మూవీని నిర్మించాడు.

కృతిస‌న‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో అభిషేక్ బెన‌ర్జీ, దీప‌క్ దోబ్రియాల్ న‌టిస్తున్నారు. కీల‌క స్పెష‌ల్ సాంగ్ లో తుముకేశ్వ‌రిగా శ్ర‌ద్దా దాస్ క‌నిపించ‌బోతోంది. హిందీతో పాటు ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు. న‌వంబ‌ర్ 25న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. తెలుగులో మాత్రం ఈ మూవీ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ద్వారా రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న ల‌భించింది.

తోడోలు కాటుకు గురైన యువ‌కుడు భాస్క‌ర్ పాత్రలో వ‌రుణ్ ధావ‌న్ న‌టించాడు. డాక్ట‌ర్ అనిక గా కృతిస‌న‌న్ న‌టించింది. తెలుగు ట్రైల‌ర్ కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ద్వారా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన 'కాంతార‌' రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ఇప్ప‌టికీ అదే జోరుని చూపిస్తోంది.

అదే ఊపుతో వున్న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ తాజాగా బాలీవుడ్ మూవీ 'భేదియా'ని 'తోడేలు'గా తెలుగులో రిలీజ్ చేస్తుండ‌టం విశేషం. గీతా వారి న‌మ్మ‌కాన్ని ఈ మూవీ ఎంత వ‌ర‌కు నిల‌బెడుతుందో తెలియాలంటే న‌వంబ‌ర్ 25 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.