Begin typing your search above and press return to search.

హీరోయిన్ ఎంట్రీతో ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లింది

By:  Tupaki Desk   |   20 March 2022 5:30 AM GMT
హీరోయిన్ ఎంట్రీతో ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లింది
X
ఒంట‌రి, మ‌హాత్మ వంటి చిత్రాల‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన మ‌ల‌యాళ న‌టి భావ‌న‌ హీరో దిలీప్ లైంగిక వేధింపుల వివాదంతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ వివాదం కార‌ణంగా 2017లో మ‌ల‌యాళ చిత్రాల‌కు తాత్కాలికంగా బ్రేకిచ్చింది. క‌న్న‌డ భాష‌లో న‌టిస్తున్న మ‌ల‌యాళ చిత్రాలకు మాత్రం గ‌త ఏదేళ్లుగా దూరంగా వుంటూ వ‌స్తోంది. తాజాగా మ‌ళ్లీ మ‌ల‌యాళ చిత్రాల్లో రీఎంట్రీ ఇస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించి ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన భావ‌న తాజాగా కేర‌ళ‌లో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న్ ఫిల్మ్ ఫెసిట‌వ‌ల్ ఆఫ్ కేర‌ళ‌లో ఛీప్ గెస్ట్ గా పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమెకు ల‌భించిన గ్రాండ్ వెల్క‌మ్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఫిల్మ్ ఫెస్టివెల్ లో సంప్ర‌దాయంగా చీరె క‌ట్టుకుని హుందాగా కుద‌న‌పు బొమ్మ‌లా క‌నిపించిన భావ‌న‌ని నిర్వాహ‌కులు స్టేజ్ పైకి సాద‌రంగా ఆహ్వానించారు. బావ‌న స్టేజ్ పైకి రాబోతోంద‌ని ప్ర‌క‌టించ‌గానే ఆడిటోరియం మొత్తం ప్రేక్ష‌కుల హర్ష‌ద్వానాల‌తో ద‌ద్ద‌రిల్లింది.

అంతే కాకుండా ఆడిటోరియంలో వున్న వారంతా ఒక్క‌సారిగా లేచి నిల‌బ‌డి భావ‌న‌కు స్టాండింగ్ ఓవేష‌న్ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆడియ‌న్స్, అవార్డ్ ఫంక్ష‌న్ ని తిల‌కించ‌డానికి వ‌చ్చిన వారంతా ఈల‌లు గోల‌తో భావ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం ఇప్ప‌డు ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. అంతే కాకుండా పోరాటం చేసిన వీర వ‌నిత భావ‌న అనే త‌ర‌హాలో బావ‌న‌ని స్టేజ్ పైకి ఆహ్వానించిన తీరు, స్టేజ్ పై వున్న ఓ మహిళ ఆత్మీయంగా భావ‌న‌ని ఆలింగ‌నం చేసుకున్న తీరు కూడా ప్ర‌తీ ఒక్క‌రినీ అల‌రిస్తోంది.

2017లో బావ‌న లైంగిక వేధిపుల అంశం కేరళ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపింది. త‌న‌ని హీరో దిలీప్ కొంత మంది చేత కిడ్నాప్ చేయించి లైంగిక వేధింపుల‌కు ప్ర‌య‌త్నించాడ‌ని న‌టి భావ‌న హీరో దిలీప్ పేరుని మొట్ట‌మొద‌టి సారి బ‌య‌ట‌పెట్ట‌డంతో ఈ ఇష్యూ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌రువాత దిలీప్ ని పోలీసులు అరెస్ట్ చేయ‌డం, బెయిల్ పై బ‌య‌టికి రావ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం భావ‌న మ‌ల‌యాళంలో `ఎన్టీక్క‌క్క‌క్కోరు ప్రేమోండ‌ర్న్‌` మూవీలో న‌టిస్తోంది. ఆదిల్ మ‌యిమూనాద్ అశ్ర‌ఫ్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా మ‌ళ్లీ కెరీర్ స్టార్ చేయ‌డం ఆనందంగా వుంద‌ని ఈ సంద‌ర్భంగా భావ‌న తెలిపింది.