Begin typing your search above and press return to search.
ఇంట్లో 87 గ్రా. గంజాయితో NCBకి చిక్కిన కమెడియన్
By: Tupaki Desk | 22 Nov 2020 9:00 AM ISTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతర పరిణామాలు తెలిసిందే. బాలీవుడ్ లో గంజాయి మాఫియా ఆట కట్టించేందుకు ఎన్.సి.బి తీవ్రమైన వేట సాగిస్తోంది. ఇందులో చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు చోటా మోటా నటీనటులు సాంకేతిక నిపుణుల చిట్టాను ఆరా తీసింది. కొందరిని ఇప్పటికే విచారించింది. మరికొందరిని వెంబడించి మరీ విచారిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ కమెడియన్ ఇంటిపై జరిగిన దాడిలో 87 గ్రాముల గంజాయి బయటపడింది. అనంతరం ఎన్.సి.బి ఆ గంజాయిని స్వాధీనపర్చుకుని కమెడియన్ ని అరెస్ట్ చేసింది. ఇంతకీ ఎవరా కమెడియన్ అంటే..? పేరు భారతీ సింగ్. కపిల్ శర్మ షో ద్వారా అభిమానులకు సుపరిచితురాలు. ఆమెను ఆమె భర్తను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు.
భారతీ సింగ్ ప్రొడక్షన్ ఆఫీస్ ఇంటిపై ఎన్.సిబి దాడి చేసిందని.. రెండు ప్రదేశాల నుండి 86.5 గ్రాముల గంజాను ఏజెన్సీ స్వాధీనం చేసుకుందని జాతీయ మాడియా కథనాలు వెలువరించింది. భారతి ఆమె భర్త హర్ష్ లింబాచియా ఇద్దరూ నిషేధిత పదార్థాన్ని వినియోగించినట్లు అంగీకరించారని సమాచారం. ప్రస్తుతం భారతిని అరెస్టు చేయగా.. ఆమె భర్తపైనా విచారణ సాగుతోంది.
చాలా మంది నెటిజనులు.. ది కపిల్ శర్మ షో ప్రముఖ తారపై చర్యను నిరసిస్తూ.. సోనీ టీవీ ప్రోగ్రాం వారి ఇటీవలి ఎపిసోడ్లలో ఒకటైన అర్నాబ్ గోస్వామిని ఎగతాళి చేసే ప్రయత్నంతో అనుసంధానించడానికి తొందరపడ్డారు. గోస్వామి అతని సహోద్యోగి ప్రదీప్ భండారిని ఎగతాళి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ వీడియోలో.. కికు కృష్ణా రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడి `ముజే డ్రగ్స్ డూ రాంట్..` అనే పదాలను `ముజే జగ్ డూకు..` బదులుగా పునఃసృష్టించినట్టు స్పష్ఠంగా కనిపించింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని... దీపికా పదుకొనేను ఎన్.సిబి ఇంతకుముందు విచారించిన సంగతి తెలిసిందే. రియాను అరెస్టు చేయగా బెయిల్ పై బయటకు వచ్చారు. అలాగే హీరో అర్జున్ రాంపాల్ .. అతని ప్రియురాలిని కూడా ఎన్.సి.బి డ్రగ్స్ విషయంలో ప్రశ్నించింది.
తాజా సంచలనాత్మక అరెస్టుపై కపిల్ శర్మ ఇతర సహనటులు అర్చన పురాణ్ సింగ్ ఇంకా స్పందించలేదు. భారతి సోనీ టీవీలో ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో `ఇండియాస్ బెస్ట్ డాన్సర్` ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ వారాంతంలో గ్రాండ్ ఫైనల్ జరగనుంది. ముగింపు ఎపిసోడ్‌లు ఇప్పటికే చిత్రీకరించారా? లేదా .. వాటి ప్రసారం నిరంతరాయంగా ప్రసారం అవుతుందా అనేది స్పష్టంగా లేదు. ఈలోగానే డ్రగ్స్ కేసులో భారతి అరెస్టు సర్వత్రా చర్చనీయాంశమైంది.